IND VS NZ: రెండవ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్ డే సిరీస్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగానే నేడు హామిల్టన్ లో మొదటి వన్ డే మొదలైంది.

S. Srikanth
Published on: 5 Feb 2020 1:34 PM IST
IND VS NZ: రెండవ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
X

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్ డే సిరీస్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగానే నేడు హామిల్టన్ లో మొదటి వన్ డే మొదలైంది. ముందుగా టాస్ గెలిచి న్యూజిలాండ్ జట్టు భారత్ ను బెటింగ్ కి ఆహ్వానించింది. అయితే ఆరంభం లోనే ఓపెనర్ల వికెట్లను కావోల్పోయి టీం ఇండియా కాస్త నిరాశకు గురిచేసింది. అయితే తరువాత క్రీజు లోకి వచ్చిన లాహ్లీ, రాహుల్ ,శ్రేయాస్ ఇయర్, దూకుడుగా ఆడి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు.

ఇదే క్రమంలో కెరీర్ లో తోలి సెంచరీ నమోదు చేసుకున్నాడు శ్రేయాస్ ఇయర్. 50 ఓవర్లు ముగిసేసమయానికి టీం ఇండియా న్యూజిలాండ్ ముందు 348 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది.. అయితే ప్రారంభం నుండే నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు 10 ఓవర్లు ముగిసే సమయానికి 56/0 తో పటిష్ట స్థితిలో ఉంది. తరువాత ఠాకూర్ బౌలింగ్ లో గుప్తిల్ 32(41) కేదార్ జాదవ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన టామ్ బ్లాండెల్ 9(10) తో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో స్టాంప్ అవుట్ అయ్యాడు. ప్ప్రస్తుతం న్యూజిలాండ్ హాట్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 110/2 తో నిలకడగా ఆడుతుంది. హెన్రీ నికోల్స్ 57(65), రాస్ టైలర్ 3(8)తో క్రీజులో ఉన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story