హర్భజన్ సింగ్‌పై మరోసారి నెటిజన్ల ఫైర్

Arun Chilukuri
Published on: 4 Dec 2020 10:42 AM IST
హర్భజన్ సింగ్‌పై మరోసారి నెటిజన్ల ఫైర్
X

టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ మరోసారి నెటిజన్లకు దొరికిపోయాడు. వ్యాక్సిన్ గురించి ఏవేవో లెక్కలు చెప్తూ.. భజ్జీ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఫైజర్ టీకా 94శాతం సమర్ధవంతంగా పనిచేస్తే... మోడెర్నా 94.5, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ 90శాతం పనిచేస్తున్నాయని.. ఐతే ఎలాంటి టీకా అవసరం లేకుండానే ఇండియాలో 93శాతానికి పైగా రికవరీ రేటు ఉందని.. ఇంకా వ్యాక్సిన్ అవసరమా అంటూ ఓ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇలాంటి తెలివితక్కువ పోస్టులు పెట్టడం మానుకో ముందు అంటూ సెటైర్లు వేస్తున్నారు. వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు చూసి ఇలాంటి పోస్టులు పెడితే ఎలా అంటూ ఓ మాట గట్టిగానే అంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story