sports awards: క్రీడాకారులకు పురస్కారాలు..అర్జున అవార్డు అందుకున్న సాయి ప్రణీత్

sports awards: క్రీడాకారులకు పురస్కారాలు..అర్జున అవార్డు అందుకున్న సాయి ప్రణీత్
x
Highlights

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29న ఉత్తమ క్రీడాకారులకు భారత ప్రభుత్వం అవార్డులు అందచేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు...

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29న ఉత్తమ క్రీడాకారులకు భారత ప్రభుత్వం అవార్డులు అందచేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు పలువురు క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్ లో పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అవార్డు గ్రహీతలు వారి కుటుంబసభ్యులతో సహా హాజరు అయ్యారు.

ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం, ప్రముఖ షట్లర్ సాయి ప్రణీత్ అర్జున పురస్కారాన్ని అందుకున్నాడు. అతనితో మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్, ఫుట్ బాల్ క్రీడాకారుడు గుర్ ప్రీత్ సింగ్, బాక్సర్ సోనియా లథర్, కబడ్డీ క్రీడాకారుడు అజయ్ ఠాకూర్ సహా మొత్తం 19 మంది క్రీడాకారులు అర్జున అవార్డులను అందుకున్నారు.

బ్యాడ్మింటన్ కోచ్ విమలకుమార్, టేబుల్ టెన్నిస్ కోచ్ సందీప్ గుప్తా, హాకీ కోచ్ నజ్జబాన్ పటేల్, కబడ్డీ కోచ్ రాంబిర్ సింగ్ ఖోఖార్, క్రికెట్ కోచ్ సంజయ్ భరద్వాజ్ ద్రోణాచార్య పురస్కారాలను అందుకున్నారు.

'రాజీవ్ ఖేల్ రత్న' అందుకున్న తొలి మహిళగా దీపా మాలిక్!

రాష్ట్రపతి చేతుల మీదుగా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రముఖ పారా అథ్లెట్ దీపా మాలిక్ అందుకున్నారు. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళగానే కాకుండా, అతి పెద్ద వయస్కురాలిగా కూడా దీపా మాలిక్ చరిత్ర సృష్టించారు.

కాగా, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు విజేత రెజ్లర్ భజరంగ్ పునియా, అర్జున అవార్డు విజేత క్రికెటర్ రవీంద్ర జడేజాతో పాటు మరో ఇద్దరు క్రీడాకారులు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories