MS Dhoni daughter Ziva: M.S. ధోని కూతురు జీవా ఏ స్కూల్ లో చదువుతుంది.. స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా

Dhivi
Published on: 6 March 2025 12:22 PM IST
MS Dhoni daughter Ziva: M.S. ధోని కూతురు జీవా ఏ స్కూల్ లో చదువుతుంది.. స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా
X

MS Dhoni daughter Ziva: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోని ఇప్పటికీ క్రికెట్ అభిమానులలో సూపర్ స్టార్. ధోని కుమార్తే జీవా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నోసారి ధోని ఆట చూసేందుకు క్రికెట్ గ్రౌండ్కు వచ్చేది. కూతురితో ఆడుకోవడం ధోనికి చాలా ఇష్టం. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ పలు వాణిజ్య ఒప్పందాలు, ఐపీఎల్ కాంట్రాక్ట్, ప్రకటనల ద్వారా ఏటా వందలకోట్లు సంపాదిస్తున్నాడు. రాంచీలో ఎంఎస్ ధోనీ లవిహ్ ఫామ్ హౌస్ లో లగ్జరీ కార్లు, బైకులు ఉన్నాయి. ఇంత సంపద ఉన్నప్పటికీ ధోనీ తన జీవితంలో చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆనందిస్తుంటాడు. భారత క్రికెట్ లో మంచి పేరు సంపాదించినప్పటికీ ధోని రాంఛీనగరాన్ని మాత్రం విడిచిపెట్టేందుకు ఇష్టపడడు. అక్కడే నివసిస్తున్నాడు. ధోని కూతురుకూడా అదే అనుభూతిని నింపాలనుకుంటున్నాడు. జీవా జార్ఖండ్ రాజధాని రాంచీలోనే పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె 10 సంవత్సరాలు. చాలా తెలివైన బాలికగా పాఠశాలలో పేరు తెచ్చుకుంది.

జీవా రాంచీలోని టోరియన్ వరల్డ్ స్కూళ్లో చదువుతోంది. ఇది నగరంలో ఫేమస్ స్కూల్. ఈ పాఠశాలను అమిత్ బజ్లా 2008 లో స్థాపించారు. ఈ పాఠశాలలో ప్రపంచ స్థాయి విద్యా సౌకర్యాలు ఉన్నాయి. ఈ పాఠశాల ఫీజుల గురించి తెలుసుకుంటే.. ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25 ఫీజుల వివరాలు పాఠశాల వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ పాఠశాల వార్షిక ఫీజు LKG నుండి ఒకటవ తరగతి వరకు రూ. 2 లక్షల 65 వేలు. ఈ పాఠశాల ఫీజును 4 వాయిదాలలో చెల్లించాలి. ఇందులో త్రైమాసికానికి రూ. 66,250 చెల్లించాలి.

2వ తరగతి నుండి 8వ తరగతి వరకు వార్షిక ఫీజు రూ.2,95,000. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు వార్షిక ఫీజు రూ.3,25,000. ఈ ఫీజులను కూడా 4 త్రైమాసికాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 2 నుండి 8 తరగతులకు త్రైమాసికానికి రూ. 73,750 చెల్లించాల్సి ఉంటుంది. 9 నుండి 12 తరగతులకు త్రైమాసికానికి రూ. 81,250 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ఈ తరగతులకు బోర్డింగ్ సౌకర్యం ఉంది. దీనికి LKG నుండి 8వ తరగతి వరకు ఫీజు రూ. 4 లక్షల 70 వేలు. 9 నుండి 12వ తరగతి వరకు, ఈ ఫీజు ఏడాదికి రూ. 5 లక్షల 10 వేలు. దీనిని 4 త్రైమాసికాలలో చెల్లించవచ్చు.

Dhivi

Dhivi

Next Story