MS Dhoni Returns To Nets : ధోని మళ్ళీ ప్రాక్టిస్ మొదలుపెట్టేశాడు

MS Dhoni Returns To Nets : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని మళ్ళీ ప్రాక్టిస్ మొదలుపెట్టేశాడు. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19

Krishna
Published on: 8 Aug 2020 12:42 PM IST
MS Dhoni Returns To Nets : ధోని మళ్ళీ ప్రాక్టిస్ మొదలుపెట్టేశాడు
X
MS Dhoni Returns To Nets

MS Dhoni Returns To Nets : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని మళ్ళీ ప్రాక్టిస్ మొదలుపెట్టేశాడు. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ధోని తన ప్రాక్టిస్ ను మొదలుపెట్టాడు. గత ఏడాది న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత మళ్ళీ ధోని జట్టులో కనిపించింది లేదు.. దాదాపుగా ధోనిని మైదానంలో చూసి 14 నెలలు అయింది.

అయితే తాజాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ గ్రీన్‌ సిగ్నల్ రావడంతో మళ్ళీ రాంచీలో నెట్స్‌లో సాధన చేస్తున్నాడు ధోని.. ఇక ఆటగాడు సురేష్ రైనా చెప్పిన ఒక రోజు తర్వాత.. మహీ ప్రాక్టీస్ ఆరంభించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.. ఇదే విషయాన్ని జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఇక గత మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణా శిబిరంలో ధోని పాల్గొన్నాడు. కానీ ఆ తరవాత కరోనా మహమ్మారి రావడంతో తిరిగి రాంచీకి వెళ్ళిపోయాడు. ఇక ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 2010, 2011,2018 సంవత్సరంలో టైటిల్ ని అందించాడు.

ఇక దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌ కి ఆటగాళ్ళు ఆగస్టు 20 లోపే అక్కడికి చేరుకోనున్నారు. అక్కడ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించేలా ప్లాన్ చేసింది బీసీసీఐ.. దీనికి సంబంధించిన షెడ్యుల్ ని త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. మొత్తం మ్యాచ్ లను యూఏఈలోని మూడు స్టేడియంలో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఇక రోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్ లలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేయాలని ఐసీసీ తీసుకున్న నిర్ణయం వల్ల ఐపిఎల్ జరగడానికి సాధ్యమైంది.

Krishna

Krishna

Next Story