Top
logo

IPL 2020 To Begin On September 19: IPL ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

IPL 2020 To Begin On September 19: IPL ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
X
IPL To Begin On September 19
Highlights

IPL 2020 To Begin On September 19: కరోనా వలన నష్టపోయిన రంగాలలో క్రీడా రంగం ఒకటి .. కరోనా వలన పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సీరీసులు

IPL 2020 To Begin On September 19: కరోనా వలన నష్టపోయిన రంగాలలో క్రీడా రంగం ఒకటి .. కరోనా వలన పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సీరీసులు రద్దు అయిపోయాయి. ఇక ఐపీఎల్ కూడా వాయిదా పడింది. అయితే మళ్ళీ ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ .. సెప్టెంబర్ 19నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు. ఇక నవంబర్ ఎనమిదిన ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని వెల్లడించారు. మొత్తం 51 రోజుల పాటు ఈ మెగా టోర్నీ సందడి చేయబోతోంది అన్నమాట.. అయితే ఈ సారి ఐపీఎల్ UAE వేదికగా జరుగుతుంది.

ఆగస్టు 20 నాటికి అన్ని ప్రాంచైజీలు అక్కడికి చేరుకుంటాయని స్పష్టం చేశారు. వచ్చే వారం జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా.. చైర్మన్ ముందుగానే డేట్స్ అనౌన్స్ చేసేశారు. ఇక అంతకుముందు కరోనా వైరస్ రాకపోతే ఈ ఏడాది మార్చి 29న ఐపీఎల్ 2020 ప్రారంభం అయ్యే ఉండేది!

ఇక రోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్ లలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేయాలని ఐసీసీ తీసుకున్న నిర్ణయం వల్ల ఐపిఎల్ జరగడానికి సాధ్యమైంది. అంతకుముందు బీసీసీఐ అధ్యక్షుడు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్ జరగకుండా ఈ ఏడాది ముగియదు అని అన్న సంగతి తెలిసిందే..

ఇక ఐపీఎల్ టోర్నీని విదేశాల్లో నిర్వహించడం కొత్తేమి కాదు.. గతంలో 2009 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లను సౌతాఫ్రికాలో నిర్వహించారు. ఇక 2014 ఎన్నికలప్పుడు కూడా కొన్ని మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించారు. ఇక 2019లో కూడా ఎన్నికలు ఉన్నప్పటికీ ఎన్నికల తేదీలు, మ్యాచ్‌లు ఒకేసారి ఉండకుండా చర్యలు తీసుకోకుండా ఐపీఎల్ మ్యాచ్ ల షెడ్యుల్ లను ప్లాన్ చేశారు.

Web TitleIndian Premier League 2020 will start on September 19 in UAE
Next Story