pv sindhu: విజయం కోసం ఇంత కష్టపడింది!

pv sindhu: విజయం కోసం ఇంత కష్టపడింది!
x
Highlights

ప్రపంచ టోర్నీని గెలిచిన పీవీ సింధు పై ప్రసంశల జల్లు కురుస్తూనే ఉంది. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఆమె విజయానికి శుభాకాంక్షలు చెబుతూనే, ఆమె విజయం వెనుక ఎంత కష్టం దాగివుందో తెలుపుతూ యువతలో స్ఫూర్తి నింపే వీడియో షేర్ చేశారు.

భారత దేశ బ్యాడ్మింటన్ చరిత్రలో సంచలనం సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు ప్రపంచ టోర్నీలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది. ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంశల జల్లు కురుస్తోంది. అందరూ ఆమె ఆటతీరును.. విజయం సాధించిన తీరునూ, దేశానికి ఆమె తెచ్చిన పేరునూ పొగుడుతూ ప్రసంశలు కురిపిస్తున్నారు. అయితే, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా మాత్రం కాస్త వినూత్నంగా తన శుభాకాంక్షలు తెలిపారు.

బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ కోసం ఆమె ఏ స్థాయిలో సన్నద్ధమయిందో చూపుతున్న వీడియోను షేర్‌ చేసిన ఆనంద్ ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడం వెనక ఎలాంటి మర్మం లేదని, ఆమె కష్టాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ట్వీట్‌ చేశారు. ఆయన షేర్‌ చేసిన వీడియోలో సింధు ఎంతో కష్టపడుతూ కనిపించింది. జిమ్‌లో వివిధ వర్కౌట్లు చేసింది. హైదరాబాద్‌లోని సుచిత్ర బ్యాడ్మింటన్‌ అకాడమీలో ఆమె సాధన తీసుకున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

ఈ ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో నొజోమి ఒకుహర(జపాన్‌)పై సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. టోర్నీ పూర్తి చేసుకుని నిన్ననే స్వదేశం చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. భారత్‌కు రాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజును కలిసి పసిడి పతకాన్ని చూపించింది. అనంతరం హైదరాబాద్‌ చేరుకుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories