Ms Dhoni Son of Sachin: ధోని సన్నాఫ్ సచిన్ : టీచర్ పోస్ట్ కు దరఖాస్తు

భారత క్రికెట్ జట్టు మాజీ సారధి ఎం ఎస్ ధోని సన్నాఫ్ సచిన్ పేరుతో టీచర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడా ఆశ్చర్యపోకండి.

Sandeep Reddy
Updated on: 3 July 2021 5:56 PM IST
Mahendra Singh Dhoni Son of Sachin Tendulkar Applied For Teacher Post in Chhattisgarh
X

ధోని సన్నాఫ్ సచిన్(ఫోటో: ఈ ఎస్ పీ ఎన్)

Ms Dhoni Son of Sachin: భారత క్రికెట్ జట్టు మాజీ సారధి ఎం ఎస్ ధోని సన్నాఫ్ సచిన్ పేరుతో టీచర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడా ఆశ్చర్యపోకండి. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లోని ఇంగ్లీష్ టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ లో ఆ పేరుతో ఒక ఆకతాయి చేసిన ఈ పని ఇపుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. మహేంద్ర సింగ్ ధోని తండ్రి పేరు సచిన్ టెండూల్కర్ పేరుతో దరఖాస్తు చేసుకున్నాక మార్కుల ఆధారంగా తుది జాబితా ప్రకటించడంతో ఈ విషయం వెలుగు చూసింది. రాయదుర్గ్ లో ఎస్విటియు యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇక అతని మొబైల్ నెంబర్ కి ఫోన్ చేసిన అధికారులు అది నకిలీ నెంబర్ గా గుర్తించి దగ్గరలోని పోలీస్ లకు ఫిర్యాదు ఇచ్చారు.


అయితే మరికొందరు పేర్లను చూసి అది నకిలీ దరఖాస్తు అని తెలుసుకోకుండానే షార్ట్ లిస్టు ఎలా చేసారని , ఇంటర్వ్యూ రౌండ్ కి ఎలా ఆహ్వానిస్తారని పలువురి నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబందించి దరఖాస్తులను సరిగ్గా తనిఖీ చేయని సిబ్బంది పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటీవలే బీహార్ లో కూడా నటి అనుపమ పరమేశ్వరన్ ఫోటో, గతంలో పలువురు హీరో హీరోయిన్స్ ఫోటోలు మరియు పేర్లతో ఇలాంటి పరీక్ష సమయంలో దరఖాస్తు చేసుకున్న ఘటనలు జరిగాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story