IPL 2021- SRH vs KKR: సన్‌రైజర్స్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం

IPL 2021- SRH vs KKR: ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై కోల్‌కతా గెలుపు...

Shireesha
Published on: 4 Oct 2021 9:23 AM IST
Kolkata Knight Raiders won over Sunrisers Hyderabad in IPL 2021 Highlights | Cricket News Today
X

సన్‌రైజర్స్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం

IPL 2021- SRH vs KKR: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేయగా అ లక్ష్యాన్ని కోల్‌కతా 19.4 కోవర్లలో ఛేదించింది. హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా గెలుపొందింది.

కోల్‌కతా బ్యాట్స్ మెన్ లు గిల్ 57స రానా 25, దినేష్ కార్తిక్ 18, ఇయాన్ మోర్గన్ రెండు పరుగులు చేశారు. అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లు కోల్‌కతా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు చేతులెత్తేశారు. దీంతో జట్టు స్పల్ప స్కోరుకే పరిమితమైంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ జట్టుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే ఓపెనర్ వృద్ధిమాన్‌ సాహా ఎలాంటి పరుగులు తీయకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే ఎన్నో ఆశలు పెట్టుకున్న జేసన్‌ రాయ్‌ 10 పరుగుల దగ్గర అవుటయ్యాడు.

కెప్టెన్ కేన్ విలియమ్సన్ 26 పరుగులుతీసి కాసేపు బౌండరీలతో అలరించాడు. ఆ తర్వాత రనౌట్‌ అయ్యాడు. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌతీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా, షకిబ్ అల్ హసన్ ఒక వికెట్ కూల్చాడు.

Shireesha

Shireesha

Next Story