Tokyo Olympics: ఒలింపిక్స్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత అథ్లెట్‌

Tokyo Olympics: డిస్కస్‌ త్రోలో ఫైనల్ చేరిన కమల్‌ప్రీత్‌ కౌర్ * ఫైనల్‌కు మొత్తం 12 మంది ఎంపిక

Sandeep Eggoju
Updated on: 31 July 2021 1:46 PM IST
Kamalpreet Reached to Final in Discus Throw in Tokyo Olympic
X

డిస్కస్ త్రోలో ఫైనల్ కి చేరిన కమల్ ప్రీత్ (ఫైనల్ ఇమేజ్)

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్‌ కమల్‌ప్రీత్‌ కౌర్‌ ఫైనల్‌కు చేరింది. ఇవాళ జరిగిన డిస్కస్‌ త్రో క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో సత్తా చాటిన కమల్‌ప్రీత్‌.. రెండోస్థానంతో ఆఖరిపోరాటానికి అర్హత పొందింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో తొలి ప్రయత్నంలో 60 మీటర్లు విసిరిన కమల్‌ప్రీత్ రెండో ప్రయత్నంలో 63.97 మూడో ప్రయత్నంలో 64 మీటర్లు విసిరింది. ఫైనల్‌కు మొత్తం 12 మంది ఎంపికవగా రెండో స్థానంలో నిలిచింది కమల్‌ప్రీత్‌. సోమవారం జరగనున్న ఫైనల్‌ పోరులో సత్తా చాటితే భారత్‌కు మరో పతకం రావడం ఖాయమైనట్లే.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story