De Kock: మద్దతు ఇవ్వడం నచ్చకనే మ్యాచ్ నుండి డికాక్ తప్పుకున్నాడా..!?

* "బ్లాక్ లైవ్ మ్యాటర్" కి మద్దతు ఇవ్వడం ఇష్టంలేకే డికాక్ మ్యాచ్ నుండి తప్పుకున్నాడన్నా దినేష్ కార్తీక్

Sandeep Reddy
Published on: 27 Oct 2021 5:54 PM IST
Is Quinton de Kock not Playing Because of his Stand on Black Live Matter Movement
X

De Kock: మద్దతు ఇవ్వడం నచ్చకనే మ్యాచ్ డికాక్ నుండి తప్పుకున్నాడా..!

De Kock: అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షకు వ్యతిరేకంగా "బ్లాక్ లైవ్ మ్యాటర్" కి మద్దతుగా టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లలో ఆటగాళ్ళు సంతాపం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలా మద్దతు చేయడం ఇష్టంలేకే దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్ మ్యాచ్ మంగళవారం వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ కి దూరంగా ఉన్నాడని భారత ఆటగాడు దినేష్ కార్తీక్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు.

ఇక భారత మాజీ ఆటగాడు హర్ష బోగ్లె కూడా డికాక్ ఇలా మద్దతు ఇవ్వకపోవడంలో నాకు ఎలాంటి ఆశ్చర్యం లేదని అతను తరువాత కూడా బ్లాక్ లైవ్ మ్యాటర్ కి మద్దతు ఇస్తాడని మాత్రం నేను అనుకోవట్లేదని ట్వీట్ చేశాడు. అయితే ఈ విషయంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ తో పాటు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం డి కాక్ అతని వ్యక్తిగత కారణాల వలనే మ్యాచ్ కి దూరంగా ఉన్నాడని ట్వీట్ చేసింది.

చివరి వరకు మ్యాచ్ లో ఉంటాడని అనుకున్న అభిమానులు మాత్రం డికాక్ తుది జట్టులో లేకపోవడంతో షాక్ అయ్యారు. తాజాగా డికాక్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో వ్యక్తిగత కారణాల లేదా నిజంగానే మద్దతు ఇవ్వడం నచ్చకనే మ్యాచ్ కి దూరంగా ఉన్నాడా అని పెద్ద చర్చే జరుగుతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story