ధోనీ ఈరోజు క్రికెట్ కి వీడ్కోలు చెప్పెస్తాడా?

ధోనీ ఈరోజు క్రికెట్ కి వీడ్కోలు చెప్పెస్తాడా?
x
Highlights

గత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ పై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఎప్పుడూ అవి నిజం అవ్వలేదు. కానీ, ఈసారి మాత్రం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అనే విషయంపై సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి.

''నేనింకా ఆ రాత్రి ఆటను మర్చిపోలేను. వికెట్ల మధ్య నన్ను ధోనీ ఫిట్ నెస్ టెస్ట్ కోసం పరిగెత్తించినట్టు పరిగెత్తించాడు.'' అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ఇపుడు సంచలనం అయింది. అకస్మాత్తుగా ధోనీతో కలిసి తానాడిన మ్యాచ్ ను గుర్తు తెచ్చుకుంటూ కోహ్లీ ట్వీట్ చేయడం మిస్టర్ కూల్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటనకు ట్రైలర్ లా ఉందని అభిమానులు భావిస్తున్నారు.



2016, టీ20 ప్రపంచకప్‌‌లో ఆస్ట్రేలియా‌తో ఢీకొట్టిన భారత్ జట్టు.. 161 పరుగుల ఛేదనలో 14 ఓవర్లు ముగిసే సమయానికి 94/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోనీ.. విరాట్ కోహ్లీతో కలిసి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అప్పటికే కీలక వికెట్లు చేజారడంతో బంతిని ఏమాత్రం గాల్లోకి లేపకుండా జాగ్రత్తగా ఆడిన ఈ జంట.. సింగిల్స్, డబుల్స్‌తోనే భారత్‌ని విజయతీరాలకి చేర్చింది. ఆ సంఘటన అకస్మాత్తుగా కోహ్లీ తెరమీదకు తీసుకురావడం వెనుక ధోనీ రిటైర్మెంట్ ప్రకటన పై తనకు అందిన సమాచారం ఉందని అభిమానులు అనుమానిస్తున్నారు. దానికి తోడు ఈరోజు (గురువారం) రాత్రి 7 గంటలకు ధోనీ మీడియా తో మాట్లాదతాడంటూ సమాచారం వస్తోంది. దీనితో ఈరోజు ధోనీ రిటైర్మెంట్ ప్రకటన వెలువడుతుందని అంతా నమ్ముతున్నారు.

కాగా, భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈనెల 15 నుంచి మూడు టీ20ల సిరీస్‌ మొదలుకానుండగా.. ఈ సిరీస్‌కి ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌ని వికెట్ కీపర్‌గా సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ధోనీ తాను ఆడబోవటం లేదని స్పష్టం చేసినందు వల్లే సెలెక్టర్లు ధోనీని వదిలి పంత్ ను సెలక్ట్ చేశారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పుడు కోహ్లీ చేసిన ట్వీట్ ధోనీ రిటైర్మెంట్ పక్కా అని రుజువు చేస్తున్నాయని అంటున్నారు.

అయితే, ధోనీ రిటైర్ కాకూడదని కోరుకుంటూ అభిమానులు ట్వీట్ల వెల్లువ కురిపిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories