మన క్రికెట్ కు మళ్లీ కెప్టెన్సీ రాజకీయాల మురికి అంటుకుందా?

మన క్రికెట్ కు మళ్లీ కెప్టెన్సీ రాజకీయాల మురికి అంటుకుందా?
x
Highlights

భారత క్రికెట్ టీం కొన్నేళ్లుగా రాజకీయాల్లేని జట్టుగా నిలబడింది. చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా అవి ఆట మీద ప్రభావం చూపించేంత పెద్దవి కాలేదు. కానీ,...

భారత క్రికెట్ టీం కొన్నేళ్లుగా రాజకీయాల్లేని జట్టుగా నిలబడింది. చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా అవి ఆట మీద ప్రభావం చూపించేంత పెద్దవి కాలేదు. కానీ, ఇప్పుడు కెప్టెన్సీ రాజకీయాల మురికి టీమిండియాకు అంటుకున్నట్టు కనిపిస్తోంది. మిస్టర్ కూల్ ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు కోహ్లీ అందుకున్నప్పుడు అంతా సజావుగా జరిగిపోయింది. చాలా మృదువుగా వ్యవహారం నడిచింది. ఇప్పుడు మాత్రం కోహ్లీ కెప్టెన్సీ పై వస్తున్న వివాదాలు అంత చిన్నవేం కాదు. వరల్డ్ కప్ కు చాలా ముందు నుంచీ కోహ్లీ కెప్టెన్సీ విషయంలో చాలా మంది సన్నాయి నొక్కులు నొక్కేవారు. ఆటగాడిగా కోహ్లీని మించిన వారు ప్రస్తుత తీమిందియాలో ఎవరూ లేరు కానీ, కెప్టెన్ గా మాత్రం సగం మార్కులే కోహ్లీకి వేస్తారు క్రికెట్ పండితులు. ఇప్పుడు వరల్డ్ కప్ లో సెమీస్ పరాజయానికి బాధ్యత కోహ్లీ తీసుకోవాలని కోరుతున్న వారు లేకపోలేదు.

నిజానికి కెప్టెన్ గా కోహ్లీకి రోహిత్ కి మధ్య వరల్డ్ కప్ లోనే స్పర్థలు మొదలయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే, విజయాల వేడిలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ సెమీస్ ఓటమితో అవి దాదాపుగా బహిర్గతమయ్యాయి. ఆటగాళ్ళ ఎంపిక.. వారి బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కోహ్లీతో రోహిత్ విబెధించాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ సెమీస్ ఓటమి తరువాత జట్టుతో ఉండకుండా ఒక్కడూ ఇండియా వెంటనే తిరిగి వచ్చేశాడని చెప్పుకున్నారు. ఇటీవల మళ్ళీ ఈ వార్తలు భాగ్గుమనుతున్నాయి. వరల్డ్ కప్ మధ్యలోనే ఇంస్తాగ్రాం లో కోహ్లీని అన్ఫ్రెండ్ చేశాడు రోహిత్. రెండు రోజుల క్రితం కోహ్లీ భార్య అనుష్క ను కూడా అన్ఫ్రెండ్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య లుకలుకలు ఉన్నాయనే విషయానికి సాక్ష్యం లభించినట్టయింది. అయితే, ఈ వార్తలకు బేసీసీఐ చెక్ పెట్టింది. అటువంటిదెం లేదని కొట్టి పారేసింది. కానీ, అసలు వాళ్ళిద్దరూ దీని విషయమై నోరు విప్పకపోవడం ఎదో ఉందనే అనుమానాల్ని రేకెత్తిస్తోంది.

ఇక వెస్టిండీస్ టూర్ కి కోహ్లీకి విశ్రాంతి ఇస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, చివరి నిమిషంలో కోహ్లీ వచ్చి చేరిపోయాడు. రోహిత్ కు కెప్టెన్సీ ఇవ్వడం ఇష్టం లేకనే ఆ పని చేశాడని క్రికెట్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే కెప్టెన్ గా వెస్టిండీస్ బయలు దేరే ముందు కోహ్లీ విలేకరులతో మాట్లాడాలి. అది సంప్రదాయంగా వస్తోంది. కానీ, సోమవారం జట్టు బయలుదేరే ముందు ఇటువంటి విలేకరుల సమావేశాలు ఏమీ ఉండవని చెప్పుకుంటున్నారు. కోహ్లీ మీడియాను ఎదుర్కోవడానికి ఇష్టపదక్పోవడమే దానికి కారణంగా చెబుతున్నారు. రోహిత్ శర్మతో విభేదాలు తలెత్తాయనే వార్తలు ఎక్కువగా వినిపిస్తుండంతో ఆ గొడవకి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయనే ఉద్దేశంతో కోహ్లీ ఈ సమావేశానికే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కోహ్లి లేదా రోహిత్ శర్మ డైరెక్ట్‌గా మాట్లాడి వివరణ ఇస్తే తప్ప.. వారి మధ్య వున్న విభేదాల వార్తలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. మరి సోమవారం ప్రెస్ మీట్ కి దూరంగా ఉండాలన్న కోహ్లీ నిర్ణయంతో కోహ్లీ నుంచి వివరణ దొరికే అవకాశం లేదు. మరి రోహిత్ శర్మ ఎమన్నా మాట్లాడతాడా లేదా అన్నది అనుమానమే. సో కెప్టెన్సీ రగడ టీమిండియా లో మొదలైందన్న వార్తల్ని ప్రస్తుతానికి నిజమనే అనుకునేలా పరిస్థితులు ఉన్నాయి. అవి ఎంత ఎక్కువగా ఉన్నాయనే విషయం విండీస్ టూర్ లో తేలిపోతుంది. జట్టు ఎలా ఆడుతుందనే విషయంతో అది స్పష్టం అవుతుంది. అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories