Irfan Pathan comments on Virat Kohli: కోహ్లి పైన ఆసక్తికరమైన వాఖ్యలు చేసిన ఇర్ఫాన్‌ పఠాన్‌

Irfan Pathan comments on Virat Kohli: కోహ్లి పైన ఆసక్తికరమైన వాఖ్యలు చేసిన ఇర్ఫాన్‌ పఠాన్‌
x
Highlights

Irfan Pathan comments on Virat Kohli: ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఆకాశానికి ఎత్తేశాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌

Irfan Pathan comments on Virat Kohli: ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఆకాశానికి ఎత్తేశాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ ..అతడి కెప్టెన్సీలో ఆడి ఉంటే తానూ ఎంతో సంతోషపడేవాడినని అన్నాడు. తాజాగా క్రిక్‌ఇన్ఫోతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్‌ , కోహ్లి పైన ఈ వాఖ్యలు చేశాడు. కెప్టెన్‌ గా కోహ్లి ఆటగాళ్ళను ప్రోత్సహిస్తాడని, నిజం చెప్పాలంటే అతను నిజమైన నాయకుడు అని ఇర్ఫాన్ అన్నాడు.

ఇక మాజీ కెప్టెన్ ధోని పై కూడా ఆసక్తికరమైన వాఖ్యలు చేశాడు ఇర్ఫాన్ .. 2007కి, 2013కి ధోనిలో చాలా మార్పులొచ్చాయని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ గా ఎదుగుతున్న సమయంలో తన అనుభవంతో ఆ ఆరేళ్లలో ధోని చాలా నేర్చుకున్నాడని తెలిపాడు పఠాన్‌.. 2007 టీ 20 వరల్డ్ కప్ కి ముందు ధోని చాలా ప్రశాంతంగా కనిపించేవాడని, ఇక కెప్టెన్ అయ్యాక ఉత్సాహంగా కనిపించేవాడని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. కీపింగ్‌ నుంచి బౌలింగ్‌ వరకు ధోని వెనకుండి నడిపించేవాడని ఇర్ఫాన్ అన్నాడు. ఇక 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ధోని బౌలర్లకి పూర్తి స్వేచ్చని ఇచ్చాడని పఠాన్‌ స్పష్టంచేశాడు.

ఇక ఇర్ఫాన్ పఠాన్‌ గంగూలీ నాయకత్వంలో ఉన్నప్పుడు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటగా బౌలర్ గా రాణించిన పఠాన్‌.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించి అల్ రౌండర్ గా ఎదిగాడు. అనేక సార్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు పఠాన్‌.. ఇక అనేక మంది కెప్టెన్లతో కలిసి తన ఆటను పంచుకున్నాడు పఠాన్‌ . గంగూలీ తర్వాత 2007 వన్డే ప్రపంచకప్‌ ద్రవిడ్‌ నాయకత్వంలో , ఇక అదే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ధోనీ నాయకత్వంలో ఆడాడు. ఇక టెస్ట్ లో అనిల్ కుంబ్లే నాయకత్వంలో ఆడాడు. ఇక 2012లో చివరిసారి టీమ్‌ఇండియా తరుపున ధోని సారధ్యంలో ఆడాడు పఠాన్‌ .. కానీ కోహ్లి కెప్టెన్సీలో ఆడే ఛాన్స్ ని మిస్ అయ్యాడు. ఇక ఐపీఎల్‌లోనూ ఎన్నో జట్ల తరఫున ఆడిన పఠాన్‌ కోహ్లి సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టున మాత్రం ఆడలేకపోయాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories