భారత సెలక్టర్లుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పఠాన్, రైనా

భారత సెలక్టర్లుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పఠాన్, రైనా
x
Irfan Pathan (File Photo)
Highlights

భారత సెలెక్టర్ల పై ఇండియాన్ మాజీ అల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా ఫైర్ అయ్యారు.

భారత సెలెక్టర్ల పై ఇండియాన్ మాజీ అల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా ఫైర్ అయ్యారు. ఈ రోజు సురేశ్ రైనాతో నేడు ఇన్‌స్టాగ్రాం లైవ్ సెషన్‌లో పాల్గొన్న పఠాన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు..28 సంవత్సరాలకే సెలెక్టర్లు తనని జట్టునుంచి తప్పించారని, మళ్లీ జట్టులోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశానని పఠాన్ చెప్పుకొచ్చాడు. ఇక 35 ఏళ్ల పఠాన్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ సాధించిన ఏకైక భారత పేసర్‌గా ఇర్ఫాన్ పఠాన్ కి పేరుంది.

ఇక సురేష్ రైనా సైతం సెలక్టర్లు పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను జట్టు నుంచి తొలగిస్తున్నట్లు మాజీ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ తనకు చెప్పలేదన్నాడు. అయితే ఆయన తనకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు చెబుతున్నాడని, అది అవాస్తవమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.. అయితే తాను మళ్లీ జట్టులోకి రావాలని ఎంతగానో కృషి చేస్తున్నాని రైనా చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories