IPL2020: బ్రావో భావోద్వేగం సందేశం

IPL2020: బ్రావో భావోద్వేగం సందేశం
x

Dwayne Bravo

Highlights

IPL2020: ఐపీఎల్ 2020 సీజన్‌ నుంచి సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో గాయం కార‌ణంగా దూర‌మైన విషయం తెలిసిందే. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరమైన బ్రేవో.. ఈ టోర్నీలో పూర్తిగా ఆస్వాదించుకుండానే తప్పుకున్నాడు.

IPL2020: ఐపీఎల్ 2020 సీజన్‌ నుంచి సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో గాయం కార‌ణంగా దూర‌మైన విషయం తెలిసిందే. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరమైన బ్రేవో.. ఈ టోర్నీలో పూర్తిగా ఆస్వాదించుకుండానే తప్పుకున్నాడు. సీఎస్‌కేది కూడా దాదాపు నిష్క్ర‌మించిన పరిస్థితి. ఇప్పటివరకూ చెన్నై 10 మ్యాచ్‌లు ఆడి ఏడింట ఓటమి పాలైంది . ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉండటంతో సీఎస్‌కే వాటిలో విజయం సాధించినా ప్లేఆఫ్స్‌కు చేరడం అసాధ్యం. జట్టును వీడుతున్న వేళ.. డ్వేన్‌ బ్రేవో సీఎస్‌కే ఫ్యాన్స్‌కు ఓ సందేశం పంపాడు.

"ఈ సీజన్‌లో మీ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాం. కొన్నిసార్లు బెస్ట్ ఇచ్చినప్పటికీ.. ఫలితం కనిపించదు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ప్రోత్సహించండి.. సపోర్ట్ చేస్తూనే ఉండండి. మేం ఛాంపియనల్లా, మరింత మెరుగ్గా తిరుగొస్తాం. చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులుగా, ఫ్యాన్స్‌గా మనమెంతో గర్వించాలి" అని బ్రావో వీడియో సందేశంలో పేర్కొన్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories