IPL 2020: ముంబై, చెన్నైల‌ హోరాహోరీ.. చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరేనా?

IPL 2020: ముంబై, చెన్నైల‌ హోరాహోరీ.. చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరేనా?
x
Highlights

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లు షార్జా వేదికగా హోరీతలబడనున్నాయి. ఇప్పటిదాకా టోర్నీలో 9 మ్యాచులు ఆడిన ముంబై.. ఆరింటిలో విజయం సాధించి మూడో స్థానంలో ఉండగా..

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లు షార్జా వేదికగా హోరీతలబడనున్నాయి. ఇప్పటిదాకా టోర్నీలో 9 మ్యాచులు ఆడిన ముంబై.. ఆరింటిలో విజయం సాధించి మూడో స్థానంలో ఉండగా.. చెన్నై కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసుకుని అట్టడుగు స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సర్వశక్తులు ఒడ్డనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ధోనీ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. ఐపీఎల్ 2020 సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. తర్వాతి మ్యాచ్‌ల్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకూ ఆడిన అన్ని సీజన్లలో ప్లేఆఫ్స్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరేది అనుమానంగానే క‌నిపిస్తుంది. .

చెన్నై టాప్ ఆర్డర్ ఫామ్ లో లేక‌పోవ‌డం.. మిడిల్ ఆర్డర్‌లో సరైన బ్యాట్స్‌మెన్ లేక‌పోవ‌డం ఇబ్బందిక‌రంగా మారింది. ధోని ఫినిషర్‌గా విజృంభించలేకపోవడం ఆ జట్టును తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇక ఈ టీ20 ఫార్మాటుకు సెట్ కాని కేదార్ జాదవ్ ఇప్పటివరకు జట్టును గెలిపించిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా గత మ్యాచులో ధోని ఇకపై యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తామని చెప్పడంతో.. తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ముంబై ఇండియన్స్ లో అంత‌గా పెద్దగా లోపాలు లేవు. హిట్ మ్యాన్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, రాహుల్ చాహర్, పొలార్డ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్లు తీసి ముంబైను రేసులో నిలుపుతున్నారు. బ్యాట్‌తో డికాక్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా ఆదరగొడుతున్నారు. మరి ఈ మ్యాచులో చెన్నై గెలిచి నిలుస్తుందో లేదో వేచి చూడాలి.

చెన్నై: సామ్ కరన్, డుప్లెసిస్, వాట్సన్/ రుతురాజ్ గైక్వాడ్, రాయుడు, కేదార్ జాదవ్/జగదీషన్, ధోని, జడేజా, దీపక్ చాహార్, ఠాకూర్, చావ్లా/తాహిర్, హజెల్‌వుడ్‌

ముంబై: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కౌల్టర్‌నైల్‌/పాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

Show Full Article
Print Article
Next Story
More Stories