T20 Challenge: యూఏఈకి చేరుకున్న భార‌త మహిళా క్రికెటర్లు

T20 Challenge: యూఏఈకి చేరుకున్న భార‌త మహిళా క్రికెటర్లు
x

 T20 Challenge: యూఏఈకి చేరుకున్న భార‌త మహిళా క్రికెటర్లు

Highlights

T20 Challenge: యూఏఈ మరో క్రికెట్ స‌మ‌రానికి వేదిక కానున్న‌ది. మహిళల టీ-20 ఛాలెంజ్‌ (మినీ ఐపీఎల్) సిరీస్‌కు ఎమిరేట్స్‌ ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే.. ఈ టోర్నీకోసం భారత్‌కు చెందిన 30 మంది అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు యూఏఈకి చేరుకున్న‌ది.

T20 Challenge: యూఏఈ మరో క్రికెట్ స‌మ‌రానికి వేదిక కానున్న‌ది. మహిళల టీ-20 ఛాలెంజ్‌ (మినీ ఐపీఎల్) సిరీస్‌కు ఎమిరేట్స్‌ ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే.. ఈ టోర్నీకోసం భారత్‌కు చెందిన 30 మంది అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు యూఏఈకి చేరుకున్న‌ది. మహిళల చాలెంజర్‌ వచ్చే నెల 4 నుంచి 9 వరకు జరగనుంది. నాలుగు మ్యాచ్‌లకూ షార్జానే వేదిక కానుంది. ఒక్కో జట్టు రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ షార్జాలోనే నిర్వహించనున్నారు.

భారత వన్డే కెప్టెన్‌ మిథాలీరాజ్‌, టీ-20 సారథి హర్మన్‌ ప్రీత్‌కౌర్‌, స్మృతి మంథాన, జెమీమా రోడ్రిగ్స్‌లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. తొమ్మిది రోజులపాటు ముంబాయిలో క్వారంటైన్‌లో ఉన్న మహిళా క్రికెటర్లు బయో బబుల్‌లోకి ప్రవేశించడానికి ముందు మరో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటారు. ఈ టోర్నీలో సూపర్‌నోవాస్, ట్రయల్‌ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ టీమ్‌లకు వరుసగా మిథాలీరాజ్‌, స్మృతి మంథాన, హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ను నాయకత్వం వహిస్తారు.. సుదీర్ఘ విరామం తర్వాత మహిళా క్రికెటర్లు మళ్లీ క్రికెట్‌ మైదానంలో అడుగుపెడుతున్నారు. మరోవైపు ఈ నెల 25న మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ ఆరంభమవుతుండడంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ దేశాలకు చెందిన అగ్రశ్రేణి క్రికెటర్లు ఈ మినీ ఐపీఎల్‌కు దూరమయ్యారు. అయితే శ్రీలంక, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా ప్లేయర్లు మాత్రం లీగ్‌లో పాల్గొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories