IPL 2023 Closing Ceremony: ఐపీఎల్ 2023 ముగింపు వేడుకలు.. బాక్సులు బద్దలే..

IPL 2023 Closing Ceremony: ఐపీఎల్ 2023 ముగింపు వేడుకలకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసింది. అహ్మ

Jyothi
Published on: 27 May 2023 4:52 PM IST
IPL 2023 Closing Ceremony: Date, Time, Full List Of Performers, Venue, Live Streaming
X

IPL 2023 Closing Ceremony: ఐపీఎల్ 2023 ముగింపు వేడుకలు.. బాక్సులు బద్దలే..

IPL2023 Closing Ceremony: ఐపీఎల్ 2023 ముగింపు వేడుకలకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి 7:30 గంటలకు మొదలు కానుంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలను బీసీసీఐ అట్టహాసంగా నిర్వహించింది. ఓపెనింగ్ సెరిమనీలో భాగంగా అరిజిత్ సింగ్, థిల్లాన్ తమ పాటలతో అలరిస్తే మిల్కీ బ్యూటీ తమన్నా, రష్మిక తమ డాన్సులతో అదరగొట్టారు. ప్రారంభోత్సవ వేడుకలను మరిపించే స్థాయిలో ముగింపు వేడుకలను నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.

ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖ ర్యాపర్ న్యూక్లియా, రాపర్ డివైన్, కింగ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన జొనితా గాంధీ అభిమానులను అలరించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ తన అధికారిక వెబ్ సైట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. అహ్మదాబాద్ ట్రీట్ కు రెడీ గా ఉండు..నరేంద్ర మోదీ స్టేడియంలో ముగింపు వేడుకల్లో కింగ్, న్యూక్లియా, జొనితా గాంధీ అలరించనున్నారంటూ ట్వీట్ చేసింది.

సాధారణంగా ఐపీఎల్ ఓపెనింగ్, క్లోజింగ్ ఈవెంట్స్ అన్నీ మ్యాచ్ లకు ముందు జరుగుతాయి. అయితే ఈసారి బీసీసీఐ స్టైల్ మార్చింది. ఫైనల్ మ్యాచ్ కు ముందు అంటే సాయంత్రం 6:30 గంటలకు డివైన్, న్యూక్లియా పర్ ఫార్మెన్స్ ఉంటుంది. ఇక కింగ్, జొనితా గాంధీ షో ఒక ఇన్నింగ్స్ ముగిశాక ఉంటుంది. దీంతో పాటు స్పెషల్ లైటింగ్ షోను సైతం బీసీసీఐ ఏర్పాటు చేసింది.

IPL 2023 ముగింపు వేడుకలను ప్రత్యక్షంగా ఎక్కడ చూడాలి:

స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో IPL2023 ముగింపు వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రేక్షకులు చూడొచ్చు. ఇక డిజిటల్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని జియో సినిమాలో సైతం చూడొచ్చు.

Jyothi

Jyothi

Next Story