IPL 2021: టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్..తుది జట్లు ఇవే

IPL 2021:ఎడిషన్ 14 రెండో మ్యాచ్ హేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, రిషబ్ పంత్ నేతృత్వం వహిస్తోన్న ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడనున్నాయి.

Samba Siva Rao
Updated on: 11 April 2021 3:41 PM IST
IPL 2021: టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్..తుది జట్లు ఇవే
X

IPL 2021: ఐపీఎల్ సీజన్ 2021 ఎడిషన్ 14 రెండో మ్యాచ్ హేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, రిషబ్ పంత్ నేతృత్వం వహిస్తోన్న ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడనున్నాయి. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో రెండు జట్లు తాడో పెడో తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఫిల్డింగ్ ఎంచుకుంది. గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీలో ధోని టీం అవమానకరంగా టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేపిటల్స్ ఫైనల్లో ముంబైపై ఓడి రన్నరప్ గా నిలిచింది. ఈ సారి రెండు జట్లు టైటిల్ సాదించాలనే పట్టుదలతో ఉన్నాయి.

ఢిల్లీ కేపిటల్స్ జట్టు:

రిషబ్ పంత్ కెప్టెన్, పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, అజింక్య రహానే, లలిత్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, హెట్మైర్, అశ్విన్, అమిత్ మిశ్రా, టామ్ కుర్రమ్.

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో:

ఎంఎస్ ధోనీ కెప్టెన్, గైక్వాడ్, ఫాఫ్ డు ఫ్లెసిస్, సురేష్ రైనా, అంబటి రాయుడు, మొయిన్ అలీ, సామ్ కుర్రమ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాగూర్, దీపక్ చాహార్

Samba Siva Rao

Samba Siva Rao

Next Story