IPL 2020: ట్రెండ్ మారింది: ‌రోహిత్ శ‌ర్మ

IPL 2020: ఐపీఎల్‌2020లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. తాజా శుక్ర‌వారం మరో విజ‌యాన్నిత‌న ఖాతాలో చేసుకుంది. అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను.. 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది

Karampoori Rajesh
Published on: 17 Oct 2020 11:52 AM IST
IPL 2020: ట్రెండ్ మారింది: ‌రోహిత్ శ‌ర్మ
X

IPL 2020: ట్రెండ్ మారింది: ‌రోహిత్ శ‌ర్మ 

IPL 2020: ఐపీఎల్‌2020లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. తాజా శుక్ర‌వారం మరో విజ‌యాన్నిత‌న ఖాతాలో చేసుకుంది. అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను.. 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని.. చాలా ఈజీగా ఛేదించింది. దీంతో రోహిత్‌ సేన పాయింట్ల పట్టికలో టాప‌ర్‌గా నిలిచింది.

ఈ సంద‌ర్భంగా ముంబాయి కెప్టెన్ మాట్లాడుతూ.. ఈ విజయం తమకు చాలా ప్రత్యేకమని, తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని అన్నారు. పూర్తిగా సమష్టి విజయమన్నాడు. ఫస్టాఫ్‌లో పెద్దగా చేజింగ్ చేయలేదని చెప్పుకొచ్చాడు.ఇక నుంచి నా అంచనా ప్రకారం సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయాన్నందుకుంటాయి. ట్రెండ్ మారిందని అభిప్రాయమం వ్య‌క్తం చేశాడు. నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలవడమనేది ఎప్పుడూ చాలెంజింగే. మ్యాచ్‌ల్లో పై చేయి సాధించడం నాకు చాలా ఇష్టమని అన్నారు.

ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి వారిపై ఆధిపత్యంలోనే ఉన్నాం. పిచ్‌ పరిస్థితులకు తగ్గట్లు బౌలర్లను ఉపయోగించామ‌ని, అన్నారు. అలాగే పిచ్ కొంచెం నెమ్మదిగా ఉండటంతో రస్సెల్‌కు కృనాల్, రాహుల్‌తో బౌలింగ్ చేయించానని తెలిపారు. బుమ్రా మ‌రోసారి మంచి ప్ర‌ద‌ర్శన ఇచ్చాడు. బ్యాటింగ్‌లో క్వింట‌న్ ఆట‌ను ఆస్వాదించాను. త‌న‌తో ఆడుతూ చాలా ఎంజాయ్ చేశానని రోహిత్ తెలిపాడు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story