IPL 2020: కోల్‌క‌తాపై ముంబాయి ఘ‌న విజ‌యం.. టేబుల్ టాప‌ర్‌గా నిలిచిన రోహిత్ సేన‌

IPL 2020: కోల్‌క‌తాపై ముంబాయి ఘ‌న విజ‌యం.. టేబుల్ టాప‌ర్‌గా నిలిచిన రోహిత్ సేన‌
x

IPL 2020: కోల్‌క‌తాపై ముంబాయి ఘ‌న విజ‌యం.. టేబుల్ టాప‌ర్‌గా నిలిచిన రోహిత్ సేన‌

Highlights

IPL 2020: మ‌రో సారి ముంబాయి ఇండియ‌న్స్ అద‌ర‌గొట్టే ప్ర‌ద‌ర్శ‌నను ఆక‌ట్టుకుంది. ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్ల మ‌ధ్య మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ముంబాయి ఘ‌న విజ‌యం సాధించింది.

IPL 2020: మ‌రో సారి ముంబాయి ఇండియ‌న్స్ అద‌ర‌గొట్టే ప్ర‌ద‌ర్శ‌నను ఆక‌ట్టుకుంది. ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్ల మ‌ధ్య మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ముంబాయి ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ దిగిన కోల్‌క‌తా. ఆదిలోనే త‌డబ‌డింది. కానీ కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్39(29), క‌మిన్స్53(36) అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 148 ప‌రుగులు చేసింది కేకేఆర్.

అనంత‌రం ల‌క్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్‌కు శుభ ఆరంభం దక్కింది. ముంబ‌యి కెప్టెన్ రోహిత్‌ శర్మ ఓపెన‌ర్‌గా వచ్చి మంచి నాక్ ఆడారు. 36 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్స్ తో 35 ప‌రుగులు చేశారు. మ‌రో వైపు డికాక్ మోత మోగించాడు. కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఈ క్ర‌మంలో రోహిత్, డికాక్ 94 పరుగుల భాగ‌స్వామ్యాని నెల‌కోల్పారు. అనంత‌రం రోహిత్ ను శివమ్‌మావి పెవిలియన్‌కు చేర్చడంతో భాగస్వామ్యానికి తెరపడింది.

తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ (10) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్‌ పాండ్య (21*, 11 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి డికాక్‌ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. వీరిద్దరు కలిసి సిక్సర్లు, ఫోర్లతో 19 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు. కోల్‌కతా బౌలర్లలో చక్రవర్తి (1/23), శివమ్‌ మావి (1/24) చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో డికాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories