హర్భజన్ వర్సెస్ ధోని ఫ్యాన్స్.. ధోని ఫ్యాన్స్‌ని పందులతో పోల్చిన హర్భజన్

Arun Chilukuri
Updated on: 16 Oct 2020 9:33 PM IST
హర్భజన్ వర్సెస్ ధోని ఫ్యాన్స్.. ధోని ఫ్యాన్స్‌ని పందులతో పోల్చిన హర్భజన్
X

వైడ్ బాల్ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ధోని మందలిస్తేనే ఎంపైర్ వైడ్ ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరగగా, ఈ కాంట్రవర్సీలోకి హర్భజన్ వచ్చి చేరాడు. ఫన్నీ ఎమోజీలు పెట్టి వెటకారం చేశాడు. అంతే ధోని ఫ్యాన్స్ భజ్జీని ఓ ఆటాడేసుకున్నారు. పనికిరాని కారణాలు చెప్పి టోర్నీకి దూరమైంది కాకుండా సొంత జట్టు కెప్టెన్‌ను అవమానిస్తావా అసలు స్పోర్టివ్ స్పిరిట్ ఇదేనా అంటూ ఘాటు విమర్శలు చేశారు. అక్కడితో ఆగారా అంటే హర్భజన్ పాములాంటోడు నమ్మడానికి లేదు అని ఫైర్ అయ్యారు. ఐతే అలాంటి కామెంట్లపై హర్భజన్ ఇన్‌డైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యాడు

తనను వ్యక్తిగతంగా కామెంట్లు చేసిన వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు భజ్జీ. సీఎస్కే ఫ్యాన్స్, ధోని అభిమానులకు గుచ్చుకునేలా ఓ ట్వీట్ చేశాడు. సీఎస్‌కే ఫ్యాన్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. పందులతో పోల్చుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పందులతో ఫైట్ చేయలేం. ఈ విషయాన్ని చాలా రోజుల కిందటే నేర్చుకున్నా పందులతో కుస్తీ పట్టడం వల్ల మనకే బురద అంటుకుంటుంది. అలాంటి కుస్తీని పందులే ఇష్టపడతాయంటూ ట్వీట్ చేశాడు భజ్జీ.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story