IPL 2020: ఏబీడీ వ‌న్ మ్యాన్ షో.. కేకేఆర్ పై బెంగుళూర్ భారీ విజయం

IPL 2020: ఏబీడీ వ‌న్ మ్యాన్ షో.. కేకేఆర్ పై బెంగుళూర్ భారీ విజయం
x

IPL 2020: ఏబీడీ వ‌న్ మ్యాన్ షో.. కేకేఆర్ పై బెంగుళూర్ భారీ విజయం

Highlights

IPL 2020: ఐపీఎల్ 2020లో షార్జా వేదికగా జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, బెంగళూరు మ్యాచ్‌లో కోహ్లీ సేన విభృంజించింది. పరుగుల వరద పారించింది. బెంగుళూర్ కీల‌క ఆట‌గాడు ఏబీ డివిలియర్స్.. వన్ మ్యాన్ షో చూపించాడు.

IPL 2020: ఐపీఎల్ 2020లో షార్జా వేదికగా జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, బెంగళూరు మ్యాచ్‌లో కోహ్లీ సేన విభృంజించింది. పరుగుల వరద పారించింది. బెంగుళూర్ కీల‌క ఆట‌గాడు ఏబీ డివిలియర్స్.. వన్ మ్యాన్ షో చూపించాడు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను చిత‌క‌బ‌ద్దాడు. స్కోరుబోర్డును ప‌రిగెత్తించాడు. దీంతో బెంగ‌ళూర్ భారీ స్కోర్ సాధించింది. దింతో బెంగళూరు చేతిలో కోల్ కతా నైట్ రైడర్స్ ఘోరమైన అపజయాన్ని చవి చూసింది. తొలుత బెంగళూరు ముందుగా బ్యాటింగ్‌కు దిగి 194 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో కోల్‌కతా బెంగళూరు బౌలర్ల ధాటికి కోల్‌కతా 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే చతికిలపడింది. దీంతో కోహ్లీసేన 82 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించి, విజయ‌కేత‌నాన్ని ఏగ‌ర‌వేసింది. ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన డివిలియర్స్‌ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదిరిపోయే ఆటతీరుతో దుమ్మురేపుతున్నది.

టాస్ గెలిచిన తర్వాత బెంగుళూరు బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆదిలో స్కోర్ బోర్డు న‌త్త‌న‌డ‌క‌గా న‌డిచింది. అరోన్‌ ఫించ్‌ (47: 37 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌ ), దేవదత్‌ పడిక్కల్‌(32: 23 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) దూకుడుకు తోడు ఆఖర్లో డివిలియర్స్‌ మెరుపులు తోడు కావడంతో మ్యాచ్ స్వ‌రూప‌మే మారింది. ప‌రుగుల మాంత్రికుడు డివిలియ‌ర్స్ (73 నాటౌట్‌: 33 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) వీరవిహారం చేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో కోల్‌కతా బెంగళూరు బౌలర్ల ధాటికి కోల్‌కతా 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే చతికిలపడింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(34: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(1)తో సహా మిగతా బ్యాట్స్‌మెన్‌ టామ్‌ బాంటన్‌(8), నితీశ్‌ రాణా(9), ఇయాన్‌ మోర్గాన్‌(8), ఆండ్రూ రస్సెల్‌(16) దారుణంగా విఫలమయ్యారు. ప్రత్యర్థి స్కోరు ఎక్కువగా ఉండడంతో లక్ష్య ఛేదనలో కోల్ కతా తొందరగా వికెట్లను పోగొట్టుకుంది. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌(2/20), క్రిస్‌ మోరీస్‌(2/17) చెరో రెండు వికెట్లు తీశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories