IPL 2020: నేడు బెంగళూర్, కోల్ కతాల హోరాహోరీపోరు.. గెలుపెవరిదో?

IPL 2020: నేడు బెంగళూర్, కోల్ కతాల హోరాహోరీపోరు..  గెలుపెవరిదో?
x

IPL 2020: నేడు బెంగళూర్, కోల్ కతాల హోరాహోరీపోరు.. గెలుపెవరిదో?

Highlights

IPL 2020: దుబాయి వేదిక జ‌రుగుతున్న ఐపీఎల్ 13 ప్ర‌తి మ్యాచ్ క్రికెట్ .. అభిమానుల‌కు పూల్ మాజా అందిస్తుంది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠగా సాగుతుంది. ఈ క్ర‌మంలో నేడు షార్జాలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగళూర్, కోల్ కతా నైట్ రైడ‌ర్స్ తలపడనున్నాయి

IPL 2020: దుబాయి వేదిక జ‌రుగుతున్న ఐపీఎల్ 13 ప్ర‌తి మ్యాచ్ క్రికెట్ .. అభిమానుల‌కు పూల్ మాజా అందిస్తుంది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠగా సాగుతుంది. ఈ క్ర‌మంలో నేడు షార్జాలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగళూర్, కోల్ కతా నైట్ రైడ‌ర్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకూ ఇరుజ‌ట్లు మొత్తం 24 మ్యాచుల్లో త‌ల‌ప‌డ‌గా, బెంగళూర్ 10, కోల్ కతా 14 మ్యాచ్ ల్లో గెలిచింది. ‌ ఇక నేడు జ‌రుగునున్న మ్యాచ్‌లో ఎలాగైనా.. గెలుపొందాల‌ని ఇరు జట్లు సంక‌ల్ప‌తంతో ఉన్నాయి.

చెన్నైసూప‌ర్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ అద్భుత విజయాన్ని సాధించింది. అదే జోరుతో మరో మ్యాచ్ గెలవాలని కసితో ఉన్నది. ఈ జ‌ట్టులో యువ ఆట‌గాడు దేవదత్‌ పడిక్కల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. విధ్వంస‌క‌రంగా బ్యాటింగ్ చేస్తు.. త‌న జ‌ట్టు స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టిస్తున్నాడు. రెండో మ్యాచ్ లో జట్టు ఓటమి పాలైనా టీమ్ నిరుత్సాహంతో లేరు. టాప్‌ ఆర్డర్‌లో పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌ రాకతో బెంగుళూర్‌ బ్యాటింగ్‌ లైనప్ చాలా‌ పటిష్టంగా మారింది. అలాగే విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్ లు కూడా మంచి ఫాంలో ఉన్నారు. స‌రైన స‌మ‌యంలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌నబ‌రుస్తున్నారు. బౌలింగ్ లోనూ బెంగళూర్‌ జోరుమీదుంది. డెల్‌ స్టెయిన్‌, నవదీప్‌ సైని, యుజ్వెంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌లతో కూడిన విభాగం పటిష్టంగా ఉంది.

పంజాబ్ తో జ‌రిగిన‌ ఆఖరి మ్యాచ్ లో కేకేఆర్ అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది. దినేష్ కార్తీక్ త‌న కెప్టెన్సీతో జ‌ట్టుకు సొగసైన విజ‌యాన్ని అందించాడు. క్లిష్టమైన సమయాల్లో మ్యాచ్‌ను తమవైపు తిప్పే బౌలర్లున్న జ‌ట్టు కోల్‌కతా. ఈ జట్టులో శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సునీల్‌‌ నరైన్‌‌, అండ్రూ రస్సెల్‌‌, ఇయాన్‌‌ మోర్గాన్‌‌, దినేశ్‌‌ కార్తీక్‌‌, టామ్‌‌ బాంటన్‌‌, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠి.. ఇలా ఎనిమిదో స్థానం వరకు ఆడే బ్యాటింగ్ డెప్త్‌‌ ఉంది. బౌలింగ్‌‌లో సునీల్ నరైన్‌‌, కుల్దీప్‌‌ స్పిన్ మ్యాజిక్‌‌ చేయగలరు. ప్యాట్ కమిన్స్‌‌, లూకీ ఫెర్గుసన్‌‌, శివమ్‌‌ మావి, ప్రసిద్‌‌ కృష్ణతో పేస్‌‌ విభాగం బలంగానే ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories