MS Dhoni's daughter: ధోనీ కూతురుపై కామెంట్లు చేసిన బాలుడి అరెస్ట్‌

MS Dhoni’s daughter: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని కూతురు జీవా ధోనిపై అసభ్యకర కామెంట్లు చేసిన 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధోనీ అభిమానులు

Karampoori Rajesh
Published on: 12 Oct 2020 11:50 AM IST
MS Dhonis daughter: ధోనీ కూతురుపై కామెంట్లు చేసిన   బాలుడి అరెస్ట్‌
X

MS Dhoni’s daughter: ధోనీ కూతురుపై కామెంట్లు చేసిన బాలుడి అరెస్ట్‌

MS Dhoni's daughter: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని కూతురు జీవా ధోనిపై అసభ్యకర కామెంట్లు చేసిన 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున‌ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేయ‌డంతో ఎంక్వైరీ వేసి, ఆ గుజరాత్ లోని ముంద్రా జిల్లా వాసిగా గుర్తించారు. ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడిని విచారించగా, ఆ పోస్ట్‌ తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. రాంచీ పోలీసులు ఇక్కడికి వచ్చిన అనంతరం నిందితుడిని వారికి అప్పగి​స్తామని కచ్‌ జిల్లా (వెస్ట్‌) ఎస్పీ సౌరబ్‌ సింగ్‌ తెలిపారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయింది. ధోని సరిగ్గా ఆడకపోవడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయిందని, మళ్లీ సరిగ్గా ఆడకపోతే జీవా ధోనిపై అత్యాచారం చేస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర కామెంట్లు చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. పలు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు దీన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని సోషల్‌ మీడియాలో డిమాండ్‌ చేశారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story