IPL 2020: సిరాజ్ సునామీ.. కుప్ప‌కూలిన కోల్‌క‌తా

IPL 2020:  సిరాజ్ సునామీ.. కుప్ప‌కూలిన కోల్‌క‌తా
x

IPL 2020: సిరాజ్ సునామీ.. కుప్ప‌కూలిన కోల్‌క‌తా

Highlights

IPL 2020: ఐపీఎల్ 2020లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ల మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. నైట్‌రైడర్స్ జట్టుకు ఆదిలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

IPL 2020: ఐపీఎల్ 2020లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ల మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. నైట్‌రైడర్స్ జట్టుకు ఆదిలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బెంగ‌ళూర్ బౌల‌ర్ల ధాటికి కోల్ క‌తా బ్యాటింగ్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది. కోల్‌క‌తా ఆట‌గాళ్లంద‌రూ ఒక్క‌రి త‌రువాత ఒక్క‌రూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితమైంది. 3 /1.. 3/2.. 3/3.. 14/4.. 32/5.. 40/6.. 57/7.. ఈ గణాంకాలను చూస్తేనే తెలిసిపోతుంది. ఏ విధంగా విధ్వంస సృష్టించారో? ఏ కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కూడా క్రీజ్‌లో నిలువ‌కుండా క‌ట్ట‌డి చేశారు. వ‌రుస‌గా వికెట్లు తీస్తూ.. కోల్‌కతాను ఏ కోశాన కూడా కోలుకోకుండా దెబ్బ‌తీశారు.

ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో రెండు వరుస ఔవర్లను మెయిడిన్ చేసిన మొట్ట మొదటి బౌలర్‌గా రికార్డు సాధించాడు.సిరాజ్ విధ్వంసానికి కోల్‌కతా టీమ్ విలవిల్లాడింది. బెంగళూరు బౌలర్లో సిరాజ్ మూడు వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ 2, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో నాలుగు మెయిడిన్ ఓవర్లు వచ్చాయి. సిరాజ్ 2, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్ చేరో మెయిడిన్ ఓవర్ వేశారు. ఐపీఎల్ చరిత్రలో నాలుగు మెయిడిన్ ఓవర్లు నమోదవడం ఇదే తొలిసారి.

టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరడంతో మోర్గాన్‌ ఒక్కడే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. మోర్గాన్‌ క్రీజులో ఉండటంతో కోల్‌కతా కనీసం 100 పరుగులైనా చేస్తుందని అనిపించింది. బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబడుతూ ముందుకు సాగాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 16వ ఓవర్‌ మూడో బంతిని ఫోర్‌ బాదిన మోర్గాన్‌..తర్వాతి బంతికే మిడ్‌వికెట్‌లో గుర్‌కీరత్‌ సింగ్‌కు చిక్కి పెవిలియన్‌ చేరడంతో కోల్‌కతా సాధారణ స్కోరు కూడా చేయలేకపోయింది. శుభ్‌మన్‌ గిల్‌(1), రాహుల్‌ త్రిపాఠి(1), నితీశ్‌ రాణా(0), టామ్‌ బాంటన్‌(10), దినేశ్‌ కార్తీక్‌(4), పాట్‌ కమిన్స్‌(4), కుల్దీప్‌ యాదవ్‌(12), ఫర్గుసన్‌(19 నాటౌట్‌) బ్యాటింగ్‌కు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories