PL 2020 Match 8 Live Updates and Live score : ఆడుతూ..పాడుతూ కోల్‌కతా ఘన విజయం!

IPL 2020 Match 8 Live Updates and Live score : హైదరాబాద్ జట్టుపై కోల్ కతా జట్టు అలవోక విజయం సాధించింది

Karampoori Rajesh
Published on: 26 Sept 2020 11:24 PM IST
PL 2020 Match 8 Live Updates and Live score : ఆడుతూ..పాడుతూ కోల్‌కతా ఘన విజయం!
X

హైదరాబాద్ బ్యాట్స్ మెన్ అతి జాగ్రత్త వారి కొంప ముంచితే.. కొంత దూకుడు..కొంత జాగ్రత్త కలగలిపి సాగిన కోల్‌కతా బ్యాట్స్మెన్ ఆటతీరు వారిని విజయానికి చేర్చింది. హైదరాబాద్ తమ ముందుంచిన 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ 18 ఓవర్లలో అధిగమించారు కోల్‌కతా బ్యాట్స్మెన్. మొత్తమ్మీద హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ విఫలం అయి మ్యాచ్ చేజార్చుకుంది.

విజయం వైపు కోల్‌కతా పయనమిలా సాగింది..

* మొదటి ఓవర్లో భువనేశ్వర్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్ (6) బౌండరీ సాధించాడు. అతడితో పాటు నరైన్‌ క్రీజులో ఉన్నాడు. ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. ఓవర్‌ ముగిసేసరికి కోల్‌కతా 6/0

* రెండో ఓవర్లో మొదట్లోనే కోల్‌కతాకి షాక్ తగిలింది ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి నరైన్‌ (0) వార్నర్‌ చేతికి చిక్కాడు. తరువాత ఖలీల్ అహ్మద్‌ బౌలింగ్‌లో గిల్ లాంగ్ఆన్‌ మీదుగా సిక్సర్‌ బాదాడు. ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు కోల్‌కతా 12/1

* రాణా చెలరేగిపోయాడు నాలుగో ఓవర్లో. ఖలీల్ బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలు సాధించాడు. దీంతో ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు కోల్‌కతా 38/1

* బౌండరీ బాది ఊపు మీదున్న రాణా (26)ను 5 వ ఓవర్లో నటరాజన్‌ బోల్తా కొట్టించాడు.

* ఆరో ఓవర్లో ఖలీల్‌ బౌలింగ్‌లో గిల్‌ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు కోల్‌కతా 52/2

* కీలకమైన 8,9,10 ఓవర్లో వరుసగా 5,7,5 పరుగులు చేసింది కోల్ కతా. అయినా.. రాన్ రేట్ కాపాడుకుంటూ వచ్చింది. 10 ఓవర్లు పూర్తి అయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేశారు కోల్ కతా బ్యాట్స్ మెన్.

* 11, 12, 13 ఓవర్లలో 8,9,8, పరుగులు చేశారు. 13వ ఓవర్‌లో శుభ్‌మన్‌గిల్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోల్‌కతా స్కోర్‌ 97/3కి చేరింది.

* ఇక అక్కడ నుంచి ఆడుతూ పాడుతూ గిల్.. మోర్గాన్ ఇదరూ కలసి కోల్‌కతామీ రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేర్చారు.

కోల్‌కతా స్కోర్ కార్డు

145/3 (18.0 ఓవర్లు), సిఆర్ఆర్: 8.05 ఆర్‌పిఓ శుభ్ మ‌న్ గిల్* నాట్ అవుట్ 70 (62) సునీల్ నరైన్ సి డేవిడ్ వార్నర్ బి ఖలీల్ అహ్మద్ 0 (2) నితీష్ రానా సి బుద్దిమాన్‌ సా బి టి నటరాజన్ 26 (13) దినేష్ కార్తీక్ lbw బి రషీద్ ఖాన్ 0 (3) మోర్గాన్* నాట్ అవుట్ 42 (29) అధ‌నం 7

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story