IPL 2020 Match 8 Updates : హైదరాబాద్ స్లో బ్యాటింగ్.. కోల్ కతా విజయ లక్ష్యం 143

IPL 2020 Match 8 Updates : హైదరాబాద్ స్లో బ్యాటింగ్.. కోల్ కతా విజయ లక్ష్యం 143
x
Highlights

IPL 2020 Match 8 Updates : డేవిడ్ వార్నర్ సారధ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్.. దినేష్ కార్తీక్ సారధ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో తలపడుతున్నాయి.

సన్ రైజర్స్ దశ మారినట్టు కనిపించడం లేదు. ఐపీఎల్ 2020 లో భాగంగా జరుగుతున్న 8 వ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు కెప్టెన్ వార్నర్. అతి పేలవంగా హైదరాబాద్ ఇన్నింగ్స్ మొదలైంది. మొదటి నాలుగు ఓవర్లలో 24 పరుగులు చేసి బెయిర్ స్టో వికెట్ కోల్పోయింది. హైదరాబాద్. బౌలింగ్ కి అనుకూలిస్తున్న పిచ్ పై ఆచి తూచి ఆడుతూ వచ్చారు హైదరాబాద్ బ్యాట్స్ మెన్. కానీ, ఓవర్లు గడుస్తున్నా..వికెట్లు చేతిలో ఉన్నా ఏమాత్రం ఎటాకింగ్ కి దిగాలేకపోయారు. దీంతో స్కోరు బోర్డు నత్తనడకన నడిచింది. అప్పుడప్పుడు బ్యాట్స్ మెన్ మెరిసినట్టు కనిపించినా ఈ ఇన్నింగ్స్ మొత్తం కోల్ కతా బౌలర్ల పైచేయే కనిపించింది. మొత్తమ్మీద 20 ఓవర్లు పూర్తయేసరికి 142 పరుగులు చేసింది హైదరాబాద్ జట్టు. దీంతో కోల్ కతా 143 పరుగుల విజయలక్ష్యం తో తరువాత బ్యాటింగ్ చేయనుంది.

హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ తీరు ఇలా..

* సునీల్‌ నరైన్‌ వేసిన తొలి ఓవర్‌లో డేవిడ్‌ వార్నర్‌(5), జానీ బెయిర్‌స్టో(1) మొత్తం ఆరు పరుగులు తీశారు. వార్నర్‌ రెండు డబుల్స్‌, ఒక సింగిల్‌ తీయగా చివరి బంతికి బెయిర్‌స్టో ఒక పరుగు తీశాడు.

* నరైన్‌ వేసిన మూడో ఓవర్‌ మూడో ఓవర్‌లో హైదరాబాద్‌ 14 పరుగులు రాబట్టింది. తొలి రెండు బంతులకు సింగిల్స్‌ రాగా, వార్నర్‌ మూడో బంతిని సిక్సర్‌గా మలిచాడు.‌ తర్వాత రెండు సింగిల్స్‌ తీయగా చివరి బంతిని బౌండరీ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి హైదరాబాద్‌ 22/0తో నిలిచింది.

* 24 పరుగుల వద్ద హైదరాబాద్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. పాట్‌ కమిన్స్‌ వేసిన నాలుగో ఓవర్‌ చివరి బంతికి బెయిర్‌స్టో(5) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అంతకుముందు ఈ ఓవర్‌లో రెండు పరుగులు రావడంతో 4 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 24/1కి చేరింది. వార్నర్‌(19), మనీష్‌ పాండే క్రీజులో ఉన్నారు.

* శివమ్‌ మావీ వేసిన ఐదో ఓవర్‌లో మనీష్‌ పాండే(7) భారీ సిక్సర్‌ బాదడంతో పాటు మరో మూడు పరుగులు వచ్చాయి. దీంతో హైదరాబాద్‌ 5 ఓవర్లకు 33/1గా నిలిచింది. వార్నర్‌(21) ఆచితూచి ఆడుతున్నాడు.

* కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన 9వ ఓవర్‌లో హైదరాబాద్‌ 10 పరుగులు రాబట్టింది. రెండో బంతికి మనీష్‌ పాండే(18) భారీ సిక్సర్‌ కొట్టడంతో పాటు మరో నాలుగు సింగిల్స్‌ వచ్చాయి. దీంతో 9 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 59/1కి చేరింది.

* వరున్‌ చక్రవర్తి వేసిన 10వ ఓవర్‌ తొలి బంతికే డేవిడ్‌ వార్నర్‌(36) ఔటయ్యాడు. బౌలర్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో హైదరాబాద్‌ 59 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అనంతరం వృద్ధిమాన్‌ సాహా(1) క్రీజులోకి రాగా చివరి రెండు బంతులకు రెండు సింగిల్స్‌ వచ్చాయి. దీంతో 10 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 61/2గా నమోదైంది.

*11, 12, 13, ఓవర్లలో 7,8,6 ఇలా వరుసగా పరుగులు చేశారు. కీలకమైన ఏ ఓవర్లలో పరుగులు చేయలేకపోవడం ఇన్నింగ్స్ స్కోరు మీద ప్రభావం చూపించింది.

*ఇక 14 వ ఓవర్లో 11 పరుగులు చేసినా తిరిగి 15 వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమె చేశారు. 16 వ ఓవర్లో సాహా సిక్స్ బాదడంతో 11 పరుగులు చేశారు సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్. దీంతో 16 వ ఓవర్ ముగిసే సరికి 110 పరుగులు చేసింది సన్ రైజర్స్ జట్టు. రెండు వికెట్లు కోల్పోయింది.

* 17 వ ఓవర్లో మనీష్ పాండే తన అర్ధ సెంచరీ పూర్తీ చేసుకున్నాడు. తరువాతి ఓవర్లోనే మరో రన్ జోడించి మనీష్ అవుటయ్యాడు. దీంతో 18 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 127/3

చివరికి 19 వ ఓవర్లో 6 పరుగులు.. 20 వ ఓవర్లో

హైదరాబాద్ స్కోర్ బోర్డ్..

డేవిడ్ వార్నర్ సి & బి వరుణ్ చక్రవర్తి 36 (30), జానీ బెయిర్‌స్టో బి పాట్ కమ్మిన్స్ 5 (10), మనీష్ పాండే సి & బి ఆండ్రీ రస్సెల్ 51(38), వృద్దిమాన్ సాహా రనౌట్ (పాట్ కమ్మిన్స్) 30 (31), మహ్మద్ నబీ * 11 (8) అభిషేక్ శర్మ * 2(3)

మొత్తం పరుగులు 142/4 (20.0 Overs)

హైదరాబాద్.. కోల్ కతా జట్లమధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
Next Story
More Stories