IPL 2020: కేఎల్‌ రాహుల్ అదురైన ఘ‌న‌త

IPL 2020: ఐపీఎల్ క్రికెట్ అభిమానుల‌కు పుల్ ఎంట‌ర్ట్మైన్ అందిస్తుంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుంది. అభిమానులకు ఊహించ‌ని విధంగా ఉత్సాహాన్ని అందిస్తున్నాయి.

Karampoori Rajesh
Published on: 19 Oct 2020 2:50 PM IST
IPL 2020: కేఎల్‌ రాహుల్ అదురైన ఘ‌న‌త
X

 IPL 2020: KL Rahul creates history,  

IPL 2020: ఐపీఎల్ క్రికెట్ అభిమానుల‌కు పుల్ ఎంట‌ర్ట్మైన్ అందిస్తుంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుంది. అభిమానులకు ఊహించ‌ని విధంగా ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. ఆదివారం దుబాయ్‌ వేదికగా జరిగిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైపై పంజాబ్‌ జట్టు విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని పంజాబ్‌ జట్టు ఆరో స్థానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ అదురైన ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు చేయడంతో ఈ సీజన్‌లో అత్యధికంగా 525 ప‌రుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్‌ చరిత్రలోనే ముంబై జట్టుపై అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గానూ గుర్తింపు పొందాడు. నాలుగుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన ముంబైపై ఇప్పటిదాకా రాహుల్‌ 580 పరుగులు చేశాడు.

ఇదే మ్యాచ్‌లో రాహుల్‌ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో వరుసగా మూడు సీజన్‌లలోనూ 500 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు సాధించాడు. ఇక భారత క్రికెటర్లలో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా ఐదు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు. మరో బ్యాట్స్‌మన్‌ సురేష్ రైనా కూడా మూడు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు. క్రిస్‌ గేల్‌ కూడా వరుసగా మూడు సీజన్లలో 500పై చిలుకు పరుగులు సాధించాడు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story