IPL 2020: ఈ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోతున్నా: డేవిడ్ వార్న‌ర్‌

IPL 2020: ఐపీఎల్ లో భాగంగా ఆదివారం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ , స‌న్‌రైజ‌ర్ హైద‌రాబాద్ మ‌ధ్య ఉత్కంఠ పోరు సాగింది. మ్యాచ్ టై కావ‌డంతో సూప‌ర్ ఓవ‌ర్ తో ఫ‌లితం తెలింది.

Karampoori Rajesh
Published on: 19 Oct 2020 1:04 PM IST
IPL 2020: ఈ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోతున్నా:  డేవిడ్ వార్న‌ర్‌
X

IPL 2020: ఈ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోతున్నా: డేవిడ్ వార్న‌ర్‌

IPL 2020: ఐపీఎల్ లో భాగంగా ఆదివారం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ , స‌న్‌రైజ‌ర్ హైద‌రాబాద్ మ‌ధ్య ఉత్కంఠ పోరు సాగింది. మ్యాచ్ టై కావ‌డంతో సూప‌ర్ ఓవ‌ర్ తో ఫ‌లితం తెలింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకూ డేవిడ్ వార్న‌ర్ అద్భుతంగా ఆడిన ఫ‌లితం లేక‌పోయింది. ఈ మ్యాచ్ అనంత‌రం వార్న‌ర్ మాట్లాడుతూ.. గెలుపు ఖాయం అనుకున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోయామ‌ని, ఈ ఓట‌మిని జీర్ణించుకోలేకపోతున్న‌ని కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ అన్నారు.

ఓటమికి ఎవర్నీ నిందించలేక.. కోపాన్ని అణచుకోలేక.. తన నాలుకను తానే కొరికేసుకోవాలని అనిపించిందని వార్నర్ భావోద్వేగానికి గురయ్యారు. చివరి ఓవర్లలో పరుగులు ఎక్కువగా రావ‌డం కూడా ఓట‌మికి మ‌రో కార‌ణ‌మ‌ని అన్నారు. గత మూడు మ్యాచ్‌ల్లో విజయానికి చేరువగా వచ్చినప్పటికీ.. గెలవలేకపోయామన్నాడు. టాస్ గెలిచాక ఫీల్డింగ్ చేయాలన్న తన నిర్ణయానికే ఇప్పటికీ కట్టుబడి ఉంటానన్న సన్‌రైజర్స్ కెప్టెన్.. 165 పరుగుల లక్ష్యాన్ని చేధించడం పెద్ద కష్టం కాదని.. కానీ కీలక వికెట్లు కోల్పోవడం దెబ్బతీసిందన్నాడు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story