IPL 2020: కోల్‌క‌తాకు 'డూ ఆర్ డై' మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

IPL 2020: కోల్‌క‌తాకు డూ ఆర్ డై మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
x

IPL 2020: కోల్‌క‌తాకు 'డూ ఆర్ డై' మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ 

Highlights

IPL 2020: క్రికెట్ అభిమానుల‌కు ఐపీఎల్ ‌2020 కావ‌ల్సినంత మజాను అందిస్తుంది. ప్ర‌తి రోజు ఓ ఉత్కంఠ భ‌రిత‌మైన మ్యాచ్ అందిస్తూ.. క్రికెట్ ల‌వ‌ర్స్ ఊర్రూత‌లూగిస్తుంది.

IPL 2020: క్రికెట్ అభిమానుల‌కు ఐపీఎల్ ‌2020 కావ‌ల్సినంత మజాను అందిస్తుంది. ప్ర‌తి రోజు ఓ ఉత్కంఠ భ‌రిత‌మైన మ్యాచ్ అందిస్తూ.. క్రికెట్ ల‌వ‌ర్స్ ఊర్రూత‌లూగిస్తుంది. ఇప్ప‌టికే ప్ర‌తి జ‌ట్టు ప‌దేసి మ్యాచ్లు ఆడాయి. దాదాపు చివ‌రి అంకంలోకి చేరుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు తలో 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ ముంగిట నిలిచాయి. తర్వాతి దశకు చేరడానికి ఆ జట్లకు మరొక్క విజయం చాలు. కానీ మిగిలిన ఒక్క బెర్త్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్ ల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ నాలుగు జట్లు చివరి బెర్తు కోసం పోటీపడనున్నాయి.

ఈ నేప‌థ్యంలో అబుదాబి వేదికగా ఢిల్లీ కేపిటల్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ సమరానికి రంగానికి సిద్దమైంది. రెండు జట్ల మ‌ధ్య హోరాహోరీ పోరు సాగ‌నున్న‌ది. ప్ర‌త్యర్థుల‌పై దండ‌యాత్ర చేస్తూ.. ఢిల్లీ విజయ పరంపరను కొనసాగిస్తుంది. మ‌రో విజ‌యం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువాల‌ని యోచిస్తుంది. వరుస అప‌జ‌యాలతో సతమతమౌతున్న కోల్‌కతాకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాలి. ఈ పోరులో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలని కోల్‌కతా పట్టుదలతో ఉంది. ఏ జ‌ట్టు విజ‌యం సాధిస్తుందో వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కాపిట‌ల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జ‌ట్టు: షుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్(డబ్ల్యూ), సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేష్ నాగర్కోటి,, ప్రసీద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.

ఢిల్లీ కాపిట‌ల్స్ జ‌ట్టు: అజింక్య రహానె, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (సి), రిషబ్ పంత్ (ప), షిమ్రాన్ హెట్మియర్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, తుషార్ దేశ్‌పాండే

Show Full Article
Print Article
Next Story
More Stories