IPL 2020: అందుకే ఓడాం: ధోనీ

IPL 2020: ఐపీఎల్ 2020లో వరుస పరాజయాలతో టోర్నీ అట్ట‌డుగు స్థానంలో ఉండ‌టం చాలా బాధ క‌రంగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు.

Karampoori Rajesh
Published on: 24 Oct 2020 11:49 AM IST
IPL 2020: అందుకే ఓడాం: ధోనీ
X

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 

IPL 2020: ఐపీఎల్ 2020లో వరుస పరాజయాలతో టోర్నీ అట్ట‌డుగు స్థానంలో ఉండ‌టం చాలా బాధ క‌రంగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. శుక్రవారం చెన్నై, ముంబాయి మ‌ధ్య‌ జ‌రిగిన‌ మ్యాచ్‌లో ముంబాయి 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మ‌హేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. ఈ ఏడాది తమకు ఏది కలిసిరాలేదని, తమ వరుస వైఫల్యాలు తీవ్రంగా బాధ ప‌డుతున్నామని అన్నారు. బ్యాటింగ్ వైఫల్యంతోనే ఈ సీజన్‌లో మూల్యం చెల్లించుకున్నామని, కనీసం వచ్చే ఏడాదికైనా క్లారిటీగా ఉండటం తమకు చాలా ముఖ్యమన్నాడు. బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లందరికి తదుపరి మ్యాచ్‌ల్లో అవకాశం కల్పిస్తామన్నాడు.

ఈ టోర్నీ ఆరంభం నుంచి ఆవ‌రోధాలు ఎదురయ్యాయి. రాయుడు గాయపడ్డాడు. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇతర బ్యాట్స్‌మెన్ సిద్దంగా లేరు. క్రికెట్‌లో టఫ్ ఫేస్‌ను ఎదుర్కొంటున్నప్పుడు కొంచెం లక్ కూడా అవసరం. కానీ అది మాకు ఏ మాత్రం లేదు. తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్న మ్యాచ్‌ల్లో టాస్ గెలవలేదు. ఈ ఏడాది ఎలాగు మాకు కలిసి రాలేదు. కనీసం వచ్చే ఏడాదికైనా జట్టు విషయంలో మాకు ఓ క్లారిటి పిక్చర్ అవసరం. చెప్పుకోచ్చాడు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story