IPL 2020: మరి కొద్దిసేపట్లో క్రికెట్ యుద్ధం.. ఎవరి బలం ఎంత?

IPL 2020:  మరి కొద్దిసేపట్లో క్రికెట్ యుద్ధం.. ఎవరి బలం ఎంత?
x
Highlights

IPL 2020 : క్రికెట్ ను ఓ మతంలా.. క్రికెట‌ర్ల‌ను దేవుళ్లుగా ఆరాధించే మ‌న‌దేశంలో ఐపీఎల్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ టోర్నీలో బ్యాట్ మెన్‌లా బాదుడు.. బౌల‌ర్ల యార్క‌ర్లు.

IPL 2020 : క్రికెట్ ను ఓ మతంలా.. క్రికెట‌ర్ల‌ను దేవుళ్లుగా ఆరాధించే మ‌న‌దేశంలో ఐపీఎల్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ టోర్నీలో బ్యాట్ మెన్‌లా బాదుడు.. బౌల‌ర్ల యార్క‌ర్లు.. అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాలు.. స్కోరు బోర్డు ప‌రుగులు.. అభిమాన ఆట‌గాళ్ల బెట్టింగ్‌లు .. అనేక అద్భుతాల మణిహారం ఐపీఎల్‌ . ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్రీడా స‌మ‌రం.. ఐపీఎల్ 2020 మ‌రికొద్ది గంట‌ల్లో ప్రారంభం కానున్న‌ది. మరి ఆయా జట్ల బలాబ‌లాలను ఓ సారి ప‌రిశీలిద్దాం.

చెన్నై 'సూప‌ర్ కింగ్స్'

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ సారథ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ క్రీడా స‌మ‌రానికి సిద్దమ‌య్యింది. ఈ జ‌ట్టు జ‌రిగిన 12 సీజ‌న్ల‌లో 10 సీజ‌న్లలో ఆడింది. ఇందులో మూడు సార్లు టైటిల్ సాధించింది. ఏకంగా 5 సార్లు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కూ చెన్నైసూప‌ర్ కింగ్స్ 165 మ్యాచులు ఆడగా 100 మ్యాచ్‌ల్లో గెలుపు ప‌తాకాన్ని ఎగ‌ర‌వేసింది. ఇలాంటి ట్రాక్ రికార్డు మ‌రో టీంకు లేదంటే అతి శ‌యోక్తి కాదు. ఈ టీం స‌క్సెస్ రేటు 61.88 శాతంగా ఉంది.

ముంబ‌యి .. గెలుపునకు కేరాఫ్

ముంబ‌యి ఇండియ‌న్స్ గెలుపుల‌తో ఐపీఎల్‌కే రారాజుగా నిలుస్తుంది. ఈ జ‌ట్టు ఐదు సార్లు ఫైన‌ల్‌లో అడుగు పెడితే.. ఏకంగా నాలుగు సార్లు ట్రోఫీకి కైవ‌సం చేసుకుంది. రోహిత్ శ‌ర్మ సార‌ధ్యంలో 2013, 2015, 2017, 2019 సీజన్లలో టైటిల్ ను సొంతం చేసుకోగా.. 2010లో రన్నరప్ గా నిలిచింది. ఈ జ‌ట్టు ఐపీఎల్‌లో 187 మ్యాచులాడిన ముంబయి 109 గెలిచి 78 ఓటమిపాలైంది. స‌క్సెస్ రేటు 58 శాతంగా ఉంది. ముంబాయి ఇండియ‌న్స్‌కు ఇప్పటి వరకు ఏడుగురు ఆటగాళ్లు సారథ్యం వహించారు. కానీ .. హిట్‌మ్యానే అంద‌రి క‌న్న మేటీ అని పించుకున్నారు. రోహిత్ సార‌ధ్యంలో 103 మ్యాచులు ఆడ‌గా.. 62 మ్యాచులు గెలుపు పొందింది. 60.19% స‌క్సెస్ రేటు న‌మోదు చేసింది. మ‌రో సారి కూడా టోర్నీ మీద క‌న్నేసింద‌నే చెప్పాలి. ఐపీఎల్ స‌మ‌రంలో ఓ అడుగు ముందే ఉంద‌ని చెప్పాలి.

'రైజింగ్‌'‌ హైదరాబాద్‌

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 2013లో అడుగుపెట్టింది. 2016లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి విజేతగా ఆవిర్భవించింది. ఆ త‌రువాత ఐపీఎల్ 2018 ఫైన‌ల్ లో త‌డ‌బ‌డి.. త్రుటిలో టైటిల్‌ కోల్పోయింది. లేదంటే రెండోసారీ ట్రోఫీ ముద్దాడేదే. అద్భుత‌మైన బౌలింగ్ అర్డ‌ర్‌తో .. హైదరాబాద్ జ‌ట్టు మంచి ఫాం లో ఉంది. డేవిడ్‌ వార్నర్‌, మనీశ్‌ పాండే, విలియమ్సన్‌ వంటి విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్ ఫ్ల‌స్ పాయింట్‌. ఇప్పటి వరకు 108 మ్యాచుల్లో తలపడ్డ ఎస్‌ఆర్‌హెచ్‌ 57 గెలిచి.. 53 స‌క్సెస్ రేటుతో గెలుపు గుర్రాలలో టాప్‌లో నిలిచింది.

కోల్ క‌త్తా '‌రైడర్స్‌'

గౌత‌మ్ గంభీర్ సార‌థ్యంలో కెర‌టాల్లాంటి ఆట‌గాళ్ల‌తో.. ప‌టిష్టమైన జ‌ట్టుగా ఐపీఎల్ రేసులో నిలిచింది. గంభీర్ సారథ్యంలో ఆ జట్టు అత్యుత్తమ ప‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి.. 2012, 2014లో టైటిల్ కైవ‌సం చేసుకుంది. లీగ్‌లో 178 మ్యాచులాడిన కోల్‌కతా 92 గెలిచి 86 ఓడింది. సక్సెస్ రేటు 52 శాతంగా ఉంది. ఆండ్రూ రసెల్‌, శుభ్‌మన్‌ గిల్‌, సునీల్‌ నరైన్‌, దినేశ్‌ కార్తీక్‌, కమిన్స్‌ వంటి ఆటగాళ్లు జట్టుకు అండతో మ‌రో సారి త‌మ జ‌ట్టు సత్తా చూపించ‌డానికి ముందుకు వ‌స్తుంది.

రాజస్థాన్ ' రాయ‌ల్స్‌'‌

ఐపీఎల్ తొలి స‌మ‌రంలోనే ట్రోఫీని కైవ‌సం చేసుకుని సంచలనం సృష్టించింది రాజస్థాన్‌ రాయల్స్‌. ఈ జ‌ట్టు షేన్‌వార్న్ సార‌థ్యంలో ట్రోఫీని అందుకున్న ఆర్‌ఆర్‌ మళ్లీ ఆ స్థాయిలో ప్రతిభ కనబరచలేదు. కేవ‌లం రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్‌ చేరుకుంది. ఈ జ‌ట్టు రెండేళ్ల నిషేధానికి గురైంది. లీగ్‌లో 147 మ్యాచులాడిన రాయల్స్‌ 75 గెలిచి.. 51శాతం స‌క్సెస్ రేటును న‌మోదు చేసుకుంది. ఈ సారి .. స్టీవ్‌స్మిత్‌, సంజు శాంసన్‌, జోస్‌ బట్లర్‌, బెన్‌స్టోక్స్‌, జయదేవ్‌ ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్ ఆట‌గాళ్ల‌తో రంగంలోకి దిగి.. త‌న జాత‌కాన్ని ప‌రీక్షించుకోనున్న‌ది.

'రాయల్‌ '‌ బెంగళూరు

విరాట్ కోహ్లీ సార‌థ్యంలో.. ఈ సాలా కప్‌ నమదే' (ఈ సారి కప్‌ మనదే) నినాదంతో ఐపీఎల్ క్రీడాస‌మ‌రంలో దిగుతున్న‌ది. జ‌ట్టులో ఛేదన రారాజు విరాట్‌ కోహ్లీ, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌గేల్‌, కేఎల్‌ రాహుల్ యోధులున్నా.. టోర్నీని కైవ‌సం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మవుతుంది. 2016, 2009లో రన్నరప్‌గా నిలవడమే బెంగళూరు అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పటి వరకు లీగ్‌లో 181 మ్యాచులాడిన కోహ్లీసేన 84 గెలిచి 93 ఓడింది. 4 ఫలితం తేలలేదు. విజయాల శాతం 47. విరాట్‌ 110 మ్యాచుల్లో సారథ్యం వహించగా 50 (45.45%) గెలిచి 56 (50.91%) ఓడాడు. ఈ సారైనా టోర్నీని కైవ‌సం చేసుకుంటుందో వేచి చూడాలి.

'కింగ్స్‌' ఆఫ్ పంజాబ్

లీగ్‌లో 12 మంది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు సారథ్యం వహించారు. ఐపీఎల్‌లో ఒకే ఒక్కసారి రన్నరప్‌గా నిలవడమే గొప్ప. ఈ జ‌ట్టులో విధ్వంసకర హిట్టర్లున్న2014లో తప్ప ఎప్పుడూ మేటీ ప్రదర్శన ఇవ్వ‌లేద‌నే చెప్పాలి. ఈ సారి కేఎల్‌ రాహుల్‌పై భారీ ఆశలే పెట్టుకుందా జట్టు. అత‌డి నాయ‌క‌త్వంలోనైనా ఉత్త‌మ ప‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుందో చూడాలి. లీగ్‌లో 176 మ్యాచుల్లో ఆడిన కింగ్స్‌ 82 గెలిచి కేవ‌లం 46 శాతం స‌క్సెస్ రేటును న‌మోదు చేసింది . ఈ సారైనా ట్రోఫీని కైవ‌సం చేసుకుంటుందో చూడాలి.

ఢిల్లీ 'డెర్ డెవిల్స్‌'

మొద‌టి నుంచి యువకులే న‌మ్ముకున్న జట్టు ఢిల్లీ డెర్ డెవిల్స్‌.. ఇన్ని సీజన్లలో కేవ‌లం మూడు సార్లే ప్లేఆఫ్ చేరుకుంది. గతేడాది దాదా, రికీ, కైఫ్‌ వంటి అనుభవజ్ఞుల వ్యూహాలతో ప్లేఆఫ్‌ చేరుకుంది. ఇప్పటి వరకు 177 మ్యాచులాడిన ఈ జ‌ట్టు కేవ‌లం 77 మ్యాచులు గెలిచింది. ఈ సారి పంత్‌, శ్రేయస్‌, ధావన్‌, అశ్విన్‌, రహానె పై ఆ జట్టు భారీ అంచనాల‌ను పెట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories