ఆర్‌సీబీ ఐపీఎల్‌ థీమ్‌ సాంగ్ వచ్చేసింది!

ఆర్‌సీబీ ఐపీఎల్‌ థీమ్‌ సాంగ్ వచ్చేసింది!
x

RCB 

Highlights

Official RCB Anthem : ఐపీఎల్ 2020కి సంబంధించి తమ థీమ్ సాంగ్ ని రిలీజ్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు.. ఆర్‌సీబీ.. ఆర్‌సీబీ

Official RCB Anthem : ఐపీఎల్ 2020కి సంబంధించి తమ థీమ్ సాంగ్ ని రిలీజ్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు.. ఆర్‌సీబీ.. ఆర్‌సీబీ.. అంటూ మొదలయ్యే ఈ పాట బాగా ఆకట్టుకుంటుంది.. ఈ పాటలో కోహ్లీతో పాటుగా డివిలియర్స్‌, ఆరోన్‌ ఫించ్‌, క్రిస్‌ మోరిస్‌, చహల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు పాటలో కనిపిస్తూ జట్టును ఎంకరేజ్ చేస్తూ కనిపించారు.. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండగా, 5లక్షలకు మందికి పైగా మంది ఈ సాంగ్ ని వీక్షించారు.

అటు ఐపీఎల్ మెదటి సీజన్ నుంచి హాట్ ఫెవరేట్ గానే రాయల్ ఛాలెంజర్స్ జట్టు బరిలోకి దిగుతోంది.. అయినప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోలేకపోయింది.. 2009, 2016 లో ఫైనల్‌ కి చేరినప్పటికి ఆ జట్టుకు నిరాశే మిగిలింది.. గత ఏడాది పేలవమైన ప్రదర్శనని కనబరిచి చివరి స్థానంలో నిలిచింది.. అయితే ఈ ఏడాది విజేత గా నిలిచేందుకు ఆ జట్టు బాగానే కృషిచేస్తుంది..

వాస్తవానికి ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 29నే ప్రారంభం కావాల్సి ఉంది. అప్పుడే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుతుండడంతో టోర్నీని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. అయినప్పటికీ కరోనావైరస్ మహమ్మారి మరింతగా పెరగడంతో ఇండియాలో ఐపీఎల్ నిర్వహణ కష్టం అయిన భావించి చివరికి దుబాయ్ కి షిఫ్ట్ చేసింది . మొత్తం 60 మ్యాచ్‌లు 53 రోజులతో ఐపీఎల్ అభిమానులను అలరించనుంది. మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19 ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 07: 30 సమయంలో మొదలవుతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories