Top
logo

IPL 2020 In UAE: ఐపీఎల్‌13: ఫస్ట్‌ మ్యాచ్‌.. ఫైనల్‌ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

IPL 2020 In UAE: ఐపీఎల్‌13: ఫస్ట్‌ మ్యాచ్‌.. ఫైనల్‌ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?
X
IPL 2020 To Begin On September 19
Highlights

IPL 2020 In UAE: కరోనా వలన నష్టపోయిన రంగాలలో క్రీడా రంగం ఒకటి .. కరోనా వలన పలు దేశాల మధ్య జరగాల్సిన

IPL 2020 In UAE: కరోనా వలన నష్టపోయిన రంగాలలో క్రీడా రంగం ఒకటి .. కరోనా వలన పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సీరీసులు రద్దు అయిపోయాయి. ఇక ఐపీఎల్ 13 కూడా వాయిదా పడింది. అయితే మళ్ళీ ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానున్నట్లుగా ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా వెల్లడించారు. మొత్తం 51 రోజుల పాటుగా ఈ మెగా టోర్నీ సందడి చేయబోతోందని అయన క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇందులో సెప్టెంబరు 19న ఐపీఎల్ తొలి మ్యాచ్, నవంబరు 10న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దీనికి సంబంధించి ఆదివారం జరిగిన పాలక మండలి భేటీలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అబుదాబి, దుబాయ్‌, షార్జాలలో మొత్తం 51 రోజులపాటు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. చైనా కంపెనీలతో పాటుగా అన్ని స్పాన్సర్లకు ఐపీఎల్‌ పాలక మండలి అనుమతించింది. ఇక ఎప్పటిలాగా కాకుండా సాయింత్రం 7 గంటలకు బదులుగా అర్ధ గంట లేటుగా అంటే 7 గంటల 30 నిమిషాలకు ఒక మ్యాచ్, 3 గంటల 30 నిమిషాలకు మరో మ్యాచ్ మొదలయ్యేలా ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఇక అటు ఐపీఎల్ 13 కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలు, గురించి మరోసారి చర్చించేందుకు త్వరలో పాలక మండలి సమావేశం కానుంది. ఇక ఆటగాళ్ళు కూడా సీజన్ మొదలయ్యే కంటే ముందే యూఏఈకి చేరుకోనున్నారు. అక్కడికి వెళ్లేముందు ఆటగాళ్లకి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

Web TitleIPL 2020 in UAE start from September 19 to November 10
Next Story