IPL 2020: రబడా అరుదైన ఘ‌న‌త

IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ పేసర్‌ కగిసో రబడా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 50 వికెట్లను సాధించిన బౌలర్‌గా స‌రికొత్త రిక్డారు సృష్టించాడు.

Karampoori Rajesh
Published on: 17 Oct 2020 11:22 PM IST
IPL 2020: రబడా అరుదైన ఘ‌న‌త
X

రబడా అరుదైన ఘ‌న‌త 

IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ పేసర్‌ కగిసో రబడా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 50 వికెట్లను సాధించిన బౌలర్‌గా స‌రికొత్త రిక్డారు సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్‌ వికెట్‌ను సాధించడం ద్వారా రబడా ఈ ఘ‌న‌త ను సాధించాడు. తన 27వ ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లోనే రబడా ఈ ఘనత నమోదు చేశాడు. ఫలితంగా సునీల్‌ నరైన్‌ పేరిట ఉన్న ఫాస్టెస్ట్‌ 50 ఐపీఎల్‌ వికెట్ల మార్కును బ‌ద్ద‌లు కొట్టాడు.

కోల్‌కతా స్పిన్నర్ నరైన్‌ 32 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఈ ఘ‌న‌త‌ సాధించగా, రబడా ఇంకా ఐదు మ్యాచ్‌లు ముందుగానే సాధించి రికార్డును తిర‌గ రాశాడు. ఈ ఫాస్టెస్ట్ వికెట్ టేకర్స్ లిస్ట్‌లో రబడా, నరైన్‌ల తర్వాత స్థానాల్లో మలింగా(33), ఇమ్రాన్‌ తాహీర్‌(35), మెక్‌లీన్‌గన్‌(36), అమిత్‌ మిశ్రా(37)లు ఉన్నారు.

అలాగే, ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో యాభై వికెట్లను సాధించిన ఘనతను కూడా రబడా సాధించింది. స‌రికొత్త రికార్డును సృష్టించాడు. రబడా 616 బంతుల్లో 50 ఐపీఎల్‌ వికెట్లను సాధించాడు. అంత‌కుముందు ఈ రికార్డు మలింగా పేరిట ఉండేది. మలింగా 749 బంతుల్లో ఈ ఫీట్‌ సాధించగా, నరైన్‌ 760 బంతుల్లో యాభై వికెట్ల మార్కును చేరాడు.

ఇప్పటికే రబడా 2017 నుంచీ ఇప్పటివరకు వరుసగా 23 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క వికెటైనా తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇదివరకు ఈ రికార్డు వినయ్‌కుమార్‌ పేరిట ఉండగా.. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తమ ఆరో మ్యాచ్‌తో రబడా అధిగమించాడు. వినయ్ కుమార్ 2012-2013 సీజన్లలో వరుసగా 19 ఇన్నింగ్స్‌ల్లో వికెట్లు పడగొట్టాడు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story