IPL 2020: రాయుడు, జ‌డేజాల మెరుపు ఇన్నింగ్ .. ఢిల్లీ ముందు భారీ ల‌క్ష్యం

IPL 2020: ఐపీఎల్‌ 2020 భాగంగా నేడు షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, ..

Karampoori Rajesh
Updated on: 17 Oct 2020 10:31 PM IST
IPL 2020:  రాయుడు, జ‌డేజాల మెరుపు ఇన్నింగ్ .. ఢిల్లీ ముందు భారీ ల‌క్ష్యం
X

IPL 2020: రాయుడు, జ‌డేజాల మెరుపు ఇన్నింగ్ .. ఢిల్లీ ముందు 180 ప‌రుగుల ల‌క్ష్యం

IPL 2020: ఐపీఎల్‌ 2020 భాగంగా నేడు షార్జా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, .. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. చెన్నై ఓపెన‌ర్లు శుభారంభాన్ని అందించ‌లేక పోయారు. దీంతో తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. తుషార్ బౌలింగ్‌లో నార్జీకి క్యాచ్ ఇచ్చి కరన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డుప్లెసిస్, వాట్సన్ ఆచితూడి ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఫాప్ డుప్లెసిస్ త‌న సూప‌ర్ డూప‌ర్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. 47 బంతుల్లో 58 రన్స్ చేశాడు.

డుప్లెసిస్ అనంత‌రం బ్యాటింగ్ వ‌చ్చిన ధోనీ మ‌రోసారి విఫ‌ల‌మయ్యాడు. కేవ‌లం 3 ప‌రుగుల‌కే అవుట్ అయ్యాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన రాయుడు త‌న క్లాసిక్ ఇన్నింగ్ తో అద‌ర‌గొట్టాడు. కేవ‌లం 25 బంతుల్లో 45 ప‌రుగులు చేశాడు. చివ‌రి గా వ‌చ్చిన రవీంద్ర జడేజా త‌న మెరుపు ఇన్నింగ్ తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. కేవ‌లం 13 బంతుల్లో 33 పరుగులు చేశాడు. దీంతో చెన్నై టీమ్ భారీ స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో నార్జీ 2 వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్‌పాండే, కగిసో రబాడ తలో వికెట్ సాధించారు.

ఈ మ్యాచ్‌లో ధోనీ త్వరగా ఔట్ అవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. 5 బంతుల్లో 3 పరుగులు చేసి ఔట్ అవడంతో.. మరోసారి విఫలమయ్యాడని కొందరు ట్రోల్ చేస్తున్నారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story