DDCA elections: డీడీసీఏ అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ కుమారుడు ఎన్నిక‌

DDCA elections:  డీడీసీఏ అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ కుమారుడు  ఎన్నిక‌
x

DDCA elections: డీడీసీఏ అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ కుమారుడు ఎన్నిక‌

Highlights

DDCA elections: కేంద్ర మాజీ మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ కీలక పదవికి ఎంపికయ్యారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

DDCA elections: కేంద్ర మాజీ మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ కీలక పదవికి ఎంపికయ్యారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 జూన్ 30 వరకు ఈ పదవిలో రోహన్ కొనసాగనున్నారు.వాస్తవానికి న్యాయవాద వృత్తిలో కొనసాగాలని రోహన్ భావించారు. కానీ నేతలు, స్థానిక అధికారుల సూచనలతో ఆయన డీడీసీఏ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. ఆయనకు పోటీగా ఎవరూ నిలవకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రోహాన్‌ జైట్లీకి పలువురు ఆటగాళ్లు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. రోహాన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీ క్రికెట్‌ సంఘం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు.అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధ్యక్ష పదవికి రజత్ శర్మ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పదవికి ఎన్నికలు జరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories