IPL 2020: Chris Gayle| క్రిస్ గేల్ మరో సరికొత్త రికార్డు

IPL 2020: Chris Gayle| ఎట్ట‌కేల‌కు ఐపీఎల్ 2020లో ది యూనివ‌ర్సల్ బాస్ క్రిస్ గేల్ రీఎంట్రీ ఇచ్చాడు. తాను వ‌చ్చిన తొలి మ్యాచ్ లోనే త‌న‌దైన ఆట‌తీరుతో అద‌ర‌గొట్టాడు. హాఫ్ సెంచ‌రీ చేసి.. పంజాబ్ జ‌ట్టు విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాడు

Karampoori Rajesh
Published on: 16 Oct 2020 3:23 PM IST
IPL 2020: Chris Gayle| క్రిస్ గేల్ మరో సరికొత్త రికార్డు
X

IPL 2020: Chris Gayle| క్రిస్ గేల్ మరో సరికొత్త రికార్డు

IPL 2020: Chris Gayle| ఎట్ట‌కేల‌కు ఐపీఎల్ 2020లో ది యూనివ‌ర్సల్ బాస్ క్రిస్ గేల్ రీఎంట్రీ ఇచ్చాడు. తాను వ‌చ్చిన తొలి మ్యాచ్ లోనే త‌న‌దైన ఆట‌తీరుతో అద‌ర‌గొట్టాడు. హాఫ్ సెంచ‌రీ చేసి.. పంజాబ్ జ‌ట్టు విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాడు.ఈ క్ర‌మంలో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఈ ఫార్మట్‌లో 10 వేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను క్రాస్ చేసినా ..క్రిస్ గేల్ . ఫోర్లు, సిక్సుల ద్వారా అత్యధిక రన్స్ సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. టీ20 ఫార్మట్‌లో ఫోర్లు, సిక్సుల ద్వారా 2,010 పరుగులు చేశాడు.

గురువారం రాత్రి షార్జాలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో గేల్ ఈ రికార్డును సాధించాడు. అతని కంటే ముందు ఈ జాబితాలో కీరన్ పొలార్డ్ ఉన్నాడు. ఇప్పటివరకు టీ20ల్లో గేల్ 13,349 పరుగులు చేశాడు. టీ20ల్లో గేల్ ఇప్పటివరకు 1027 ఫోర్లు, 982 సిక్సులు బాదాడు.

క్రిస్ గేల్ 2009 నుంచీ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఇప్పటిదాకా 126 మ్యాచ్‌లల్లో ఆడి 4537 పరుగులు చేశాడు. 15 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.ఐపీఎల్‌లో క్రిస్ గేల్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులు. బ్యాటింగ్ యావరేజ్ 41.24గా నమోదైంది. స్ట్రైక్ రేట్ 150.53 గా న‌మోదు అయింది. ఈ ఏడాది గేల్ ఫుడ్‌ పాయిజన్ కారణంగా మొదటి ఏడు మ్యాచ్‌లకు గేల్ దూరమయ్యాడు. నిన్న ఆడిన తొలి మ్యాచ్‌లోనే గేల్ చెలరేగాడు. 45 బంతుల్లో ఐదు సిక్సులు, ఓ ఫోర్ సహాయంతో 53 పరుగులు చేశాడు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story