Top
logo

IPL 2020: ఐపీఎల్‌కి ధోనీ గుడ్‌బై !? నెట్టింట ప్ర‌శ్న‌ల వెల్లువ‌

IPL 2020:  ఐపీఎల్‌కి ధోనీ  గుడ్‌బై !? నెట్టింట ప్ర‌శ్న‌ల వెల్లువ‌
X
Highlights

IPL 2020: ఐపీఎల్‌-13లో మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అందరి కంటే ముందే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

IPL 2020: ఐపీఎల్‌-13లో మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అందరి కంటే ముందే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది చెన్నై ఘోర ప‌రాజ‌యాల‌ను ముట్ట‌క‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో ధోనీ కెప్టెన్సీపై ఒక్కింత అస‌హ‌నం వ్య‌క్తం అవుతుంది. ప‌లువురు మాజీ, సీనియ‌ర్ ఆట‌గాళ్ల నుంచి కూడా విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ధోనీ చేత‌లు చూస్తుంటే.. ఇక ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్ అవుతున్నాడా? అనే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి కార‌ణాలు కూడా లేక‌పోలేదు. కొన్ని సందర్భాలను చూపిస్తూ నెటిజెన్లు వివరిస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ తన జెర్సీని జోస్ బట్లర్‌కు కానుకగా ఇచ్చాడు. అలాగే ముంబై తో ప‌రాజ‌యం త‌రువాత కూడా.. అల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా మరియు కృనాల్ పాండ్యాలకు కూడా ధోనీ జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. నెంబర్ 7‌తో పాటు ధోనీ అని పేరు రాసిన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు.

ఇక నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం పాండ్యా సోదరులకు ధోనీ నుంచి అపూర్వమైన కానుక లభించిందని చెబుతూ హార్ధిక్ మరియు కృనాల్ పాండ్యాలు ధోనీ జెర్సీతో దిగిన ఫోటోను ఐపీఎల్ నిర్వాహకులు తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌పై పోస్టు చేశారు.ధోనీ ఇలా తన జెర్సీలను ఇతర జట్ల ప్లేయర్లకు ఇవ్వడం చూస్తే.. ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షాన్ని కురిపిస్తున్నారు.


Web TitleIPL 2020: chennai Super Kings: Decoding Post-Match Gestures, Is Ms Dhoni Quitting Ipl Also?
Next Story