IND vs ENG: నాల్గవ టీ20లో విజయం అంత ఈజీ కాదు.. టీం ఇండియా ముందున్న సవాళ్లు ఇవే..!

Indias Key Concerns Ahead of the Fourth T20 Against England
x

IND vs ENG: నాల్గవ టీ20లో విజయం అంత ఈజీ కాదు.. టీం ఇండియా ముందున్న సవాళ్లు ఇవే..!

Highlights

IND vs ENG: ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో T20 మ్యాచ్‌లో టీమిండియా 26 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

IND vs ENG: ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో T20 మ్యాచ్‌లో టీమిండియా 26 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్, జనవరి 31న పుణెలో జరగనున్న నాలుగో T20ని గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు కొన్ని ప్రధాన ప్రశ్నలకు సమాధానం కనుగొనాల్సి ఉంటుంది.

1. ధ్రువ్ జురెల్‌ను మళ్లీ ఛాన్స్ ఇవ్వాలా?

రింకూ సింగ్ గాయపడడంతో ధ్రువ్ జురెల్‌ను వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు. అయితే జురెల్ మూడో T20లో రాణించలేకపోయాడు. ఈ పరిస్థితిలో నాలుగో T20లో మళ్లీ జురెల్‌ను నమ్మాలని యాజమాన్యం భావిస్తుందా, లేక వేరే మార్పులపై దృష్టి పెడుతుందా అన్నది చూడాలి.

2. ఫాస్ట్ బౌలింగ్‌కు సంజూ సామ్‌సన్ సెట్ అవుతాడా?

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో సామ్‌సన్ తడబడుతున్నాడు. అతని బ్యాటింగ్‌లో కాస్త అనిశ్చితత్వం కనిపిస్తోంది. గత మూడు మ్యాచ్‌లలో అతని స్కోర్లు 26, 05, 03 మాత్రమే. స్పీడ్ బౌలింగ్‌కు అతను తడబడటం టీమిండియా మెనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

3. రమణ్ దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వాలా?

రింకూ సింగ్ గైర్హాజరీతో జట్టులో బలహీనత కనిపిస్తోంది. ఫినిషర్ రోల్ కోసం ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇచ్చినా ఫలితం రాలేదు. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ రమణ్ దీప్ సింగ్‌ను ఆడించాలని ఆలోచిస్తోంది. ఎందుకంటే రమణ్ దీప్ బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ బౌలింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు.

4. శివమ్ దూబేకు ప్లేయింగ్ XIలో స్థానం దక్కుతుందా?

ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను టీమిండియా బ్యాట్స్‌మెన్ సరిగ్గా ఆడలేకపోతున్నారు. అయితే స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు శివమ్ దూబే మంచి ఆప్షన్ అవుతాడు. అతను స్లో బౌలర్లపై భారీ షాట్లు ఆడగలడు. ఈ నేపథ్యంలో నాలుగో మ్యాచ్‌లో శివమ్ దూబేకు అవకాశం దక్కుతుందా? అన్నది చూడాలి.

5. అర్షదీప్ సింగ్ తిరిగి జట్టులోకి వస్తాడా?

మూడో T20లో అర్షదీప్ సింగ్‌ను విశ్రాంతినిచ్చారు.. కానీ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. బౌలింగ్‌లో తక్కువ లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్స్‌తో భారత్ ఇబ్బంది పడింది. ఇప్పుడు నాలుగో T20 కోసం అర్షదీప్ సింగ్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలా? లేదా షమీని కొనసాగించాలా?

ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే టీమిండియా నాలుగో T20లో విజయాన్ని సాధించగలదు. ఇంగ్లాండ్ బలమైన జట్టు అయినప్పటికీ సరైన మార్పులు చేస్తే భారత్ సిరీస్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories