Surya Kumar Yadav Out Viral: యాదవ్ ఔట్ పై సెహ్వాగ్ ఫన్నీ ట్వీట్

Surya Kumar Yadav Out Viral: ఇంగ్లండ్‌తో జరిగిన 4వ టీ20లో సూర్యకుమార్ యాదవ్‌‌ వివాదాస్పద రీతిలో ఔటైన సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 19 March 2021 2:50 PM IST
Virender Sehwag Hilariously Troll Third Umpire about Surya Kumar Yadav Out
X
మలాన్ క్యాచ్ పై సెహ్వాగ్ ఫన్నీ ట్వీట్ (ఫొటో ట్విట్టర్)

Surya Kumar Yadav Out Viral: గురువారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్ యాదవ్‌‌ వివాదాస్పద రీతిలో ఔటైన సంగతి తెలిసిందే. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యాదవ్ అవుట్‌ కాదని స్పష్టంగా తెలుస్తున్నా.. థర్డ్‌ అంపైర్‌‌ అవుట్‌ అరి ప్రకటించడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు నెటిజన్లు. అయితే, బంతిని అందుకున్న డేవిడ్‌ మలాన్‌పై మీమ్స్‌, ట్రోల్స్‌ తో ఆడుకుంటున్నారు.

తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా సూర్య కుమార్‌ ఔట్‌పై ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ షేర్‌ చేసిన ఫొటోలో కళ్లకు గంతలు కట్టుకుని ఓ కుర్రాడు నిలబడి ఉన్నాడు. మరో ఫొటోలో డేవిడ్‌ మలాన్‌ క్యాచ్‌ అందుకున్న ఫోటోను ఉంచాడు. సూర్య కుమార్‌ ఔట్‌ పై డెసిషన్ తీసుకోవాల్సిన థర్డ్‌ అంపైర్‌.. కళ్లకు గంతలు కట్టుకున్నాడు. అందుకే అతనికి సూర్య ఔట్‌ అయినట్లు కనపడింది. ఇది చీటింగ్‌ అంటూ కామెంట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నవ్వులు పంచుతోంది.

అంతకముందు కోహ్లి కూడా సూర్యకుమార్‌ అవుట్‌పై అసహనం వ్యక్తం చేశాడు. రిప్లైలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించినా.. అంపైర్‌ అవుటివ్వడంపై కోహ్లి ఆశ్చర్యపోయాడు.



Venkata Chari

Venkata Chari

Next Story