IND vs ENG: ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన ఇండియా... 3-0 తేడాతో వన్డే సిరీస్ భారత్ సొంతం

India beats England in 3rd ODI to clinch oneday series with 3-0, Shubman Gill century helps team india to win big
x

IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన ఇండియా... వన్డే సిరీస్ భారత్ సొంతం

Highlights

IND vs ENG 3rd ODI match: ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగుల భారీ స్కోర్...

IND vs ENG 3rd ODI match: ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇండియా విధించిన భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ భారత్‌కు పోటీనివ్వలేకపోయింది. 34.2 ఓవర్లకే కేవలం 214 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. దీంతో 142 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 3-0 తేడాతో వన్డే సిరీస్ కూడా భారత్ సొంతమైంది.

శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ 3వ వన్డేలో 102 బంతుల్లో 112 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్ కెరీర్‌లో శుభ్‌మన్ గిల్‌కు ఇది 7వ సెంచరీ. ఈ సెంచరీతో శుభ్‌మన్ గిల్ మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు. తన 50వ వన్డే మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. అందుకే శుభ్‌మన్ గిల్‌కు ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు.

శ్రేయాస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52), కేఎల్ రాహుల్ (40) లాంటి ఆటగాళ్లు కూడా ఈ 3వ వన్డేలో రాణించారు. అందరి సమష్టి కృషితో టీమిండియా 356 పరుగుల భారీ స్కోర్ చేసింది.

మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు పరస్పరం విష్ చేసుకుంటున్న దృశ్యాలు

ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లు, మార్క్ ఉడ్ 2 వికెట్స్‌తో రాణించారు. మిగతా బౌలర్లు ఎవ్వరూ పెద్దగా రాణించలేదు.

టీమిండియా బ్యాట్స్ మేన్ భారీ స్కోర్ చేయడంలో సక్సెస్ కాగా... ఇంగ్లాండ్ ఆటగాళ్లను తక్కువ స్కోర్‌కే ఔట్ చేయడంలో టీమిండియా బౌలర్లు సూపర్ అనిపించుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్య చెరో రెండు వికెట్స్ తీసుకున్నారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లకు చెరో వికెట్ దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories