IPL 2021: ఇవాళ్టి నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం

ఐపీల్ 2021 పునఃప్రారంభం (ఫైల్ ఇమేజ్)
IPL 2021: యూఏఈలో జరగనున్న సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లు * నేడు ముంబైతో తలపడనున్న చెన్నై
IPL 2021: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ ధనాధన్ మళ్లీ పునఃప్రారంభమవుతోంది. కరోనా కారణంగా ఆగిపోయిన్ లీగ్.. మళ్లీ నేటి నుంచి యూఏఈ వేదికగా కొనసాగనుంది. మొదటి ఫేజ్‌లో భారత్‌లో 29 మ్యాచ్‌లు జరగగా.. కరోనా కేసులు అధికమవడం.. ప్లేయర్లు కూడా కోవిడ్ బారిన పడటంతో ఐపీఎల్ వాయిదా పడింది. అయితే.. 3నెలల విరామం తర్వాత మరోసారి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు రెడీ అయిపోయింది ఇండియన్ ప్రీమియర్ లీగ్.
ఇక ఇవాళ ప్రారంభమమయ్యే రెండో దఫాలో తొలి మ్యాచ్‌గా చెన్నైతో ముంబై తలపడనుంది. అబుదాబి వేదికగా ఈ మ్యార్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్‌లోని చివరి మ్యాచ్‌లో ముంబై చేతిలో ధోని సేన ఓటమి పాలైంది. మరి.. ఇవాళ జరిగే మ్యాచ్‌లో చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా చేతులెత్తేస్తుందా అన్న అంశం ఆసక్తిగా మారింది. ఇక.. రెండో మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో 8 పాయింట్లతో ముంబై ఇండియన్స్ నిలిచింది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Audimulapu Suresh: టీడీపీకి ఇదే చివరి మహానాడు
29 May 2022 8:34 AM GMTబీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి
29 May 2022 8:13 AM GMTశంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
29 May 2022 7:45 AM GMTతెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల...
29 May 2022 7:17 AM GMTప్రిన్సిపల్ Vs స్టాప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నల్గొండ...
29 May 2022 6:30 AM GMT