Indian Hockey Team: ఈ టీమ్‌లో 20 మంది విరాట్ కోహ్లీలు ఉన్నారు.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Indian Hockey Team: భారత పురుషుల హాకీ జట్టు మెంటల్ కండిషనింగ్ కోచ్ పాడీ అప్టన్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

Arun Chilukuri
Published on: 3 Sept 2025 10:45 AM IST
Indian Hockey Team Has 20 Virat Kohlis Coach Paddy Uptons Bold Statement
X

Indian Hockey Team: ఈ టీమ్‌లో 20 మంది విరాట్ కోహ్లీలు ఉన్నారు.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Indian Hockey Team: భారత పురుషుల హాకీ జట్టు మెంటల్ కండిషనింగ్ కోచ్ పాడీ అప్టన్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ప్రస్తుత హాకీ జట్టులోని ఆటగాళ్ల ఫిట్‌నెస్, అంకితభావం భారత క్రికెట్ జట్టు కంటే చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. 2011 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుతో కూడా పనిచేసిన అప్టన్, ఈ హాకీ జట్టును స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోల్చారు. ఈ జట్టులో 18-20 మంది విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీహార్‌లో జరుగుతున్న 2025 హాకీ ఆసియా కప్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్ల గురించి మాట్లాడితే మొదటగా విరాట్ కోహ్లీ పేరు వినిపిస్తుంది. ఆయనకున్న ఫిట్‌నెస్ స్థాయి చాలా తక్కువ మంది క్రికెటర్లకు ఉంటుంది. కానీ, భారత పురుషుల హాకీ జట్టు మెంటల్ కండిషనింగ్ కోచ్ పాడీ అప్టన్ ప్రకారం.. తమ జట్టులో 18 నుంచి 20 మంది ఆటగాళ్లు విరాట్ కోహ్లీ లాంటి ఫిట్‌నెస్ కలిగి ఉన్నారు. ఈ వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి.

పాడీ అప్టన్ సౌతాఫ్రికాకు చెందినవారు. ఆయన క్రికెట్ కోచింగ్‌తో పాటు ఆటగాళ్ల మానసిక కండిషనింగ్‌కు పేరుగాంచారు. తన అద్భుతమైన కెరీర్‌లో అప్టన్ అనేక క్రీడలతో పనిచేశారు. 2011లో భారత్ క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఆయన హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ సహాయక సిబ్బందిలో ఒకరు. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టులో కూడా ఆయన భాగమయ్యారు. గతేడాది సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను భారత ఆటగాడు డి.గుకేశ్ గెలుచుకున్నారు. గుకేశ్‌ను చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా మార్చడంలో పాడీ అప్టన్ కీలక పాత్ర పోషించారు. పాడీ అప్టన్ ఆయనను మానసికంగా, శారీరకంగా చాలా బలంగా తయారు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story