బ్యాటింగ్ లో రాణించిన భారత బౌలర్స్.. రెండో వన్డేలో భారత్ గెలుపు

Sandeep Reddy
Updated on: 21 July 2021 10:54 AM IST
India Won The Match Against Sri lanka in Second ODI
X

టీం ఇండియా 

India vs Sri Lanka: మంగళవారం శ్రీలంకతో జరిగిన జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మిడిల్ ఆర్డర్ లో వెంటవెంటనే వికెట్స్ పడటంతో భారత్ గెలుపు కష్టమైన చివర్లో బౌలర్స్ దీపక్ చాహర్ 69 పరుగులు, భువనేశ్వర్ కుమార్ 19 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 రన్స్ చేసింది. ఫెర్నాండో 50 పరుగులు, అస్లాంక 65 పరుగులతో రాణించగా చివర్లో కరుణరత్నే44 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో చాహల్(3/50), భువనేశ్వర్ కుమార్(3/54) మూడేసి వికెట్లు తీయగా, దీపక్ చాహర్ (2/53) రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం చేజింగ్‌కు దిగిన భారత్ చాహర్ బ్యాటింగ్ ధాటికి మరో ఐదు బంతులు 49.1 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసి విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 53, మనీశ్ పాండే 37, కృనాల్ పాండ్యా 35 రాణించారు. ఇక రెండో వన్డే విజయంతో మూడు వన్డే ల సిరీస్ లో మరో వన్డే మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ని కైవసం చేసుకుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story