India vs New Zealand: టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీంఇండియా

*3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ *73 పరుగుల భారీ తేడాతో ఘన విజయం

Shilpa
Published on: 23 Nov 2021 6:42 AM IST
India Won the Match Against New Zealand with 73 Runs in T20 Series
X

టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీంఇండియా(ఫైల్ ఫోటో)

India vs New Zealand: టీ20 వరల్డ్‌కప్‌ లో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా స్వదేశంలో మాత్రం అద్భుతంగా రాణించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసి సత్తా చాటింది. కోల్‌కతా వేదికగా ఆఖరి మ్యాచ్‌లో రోహిత్‌ సేన 73 పరుగుల భారీ తేడాతో కివీస్‌ను మట్టిమరికరిపించింది.

టీ20 సారథిగా రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్‌ను ఇలా వైట్‌వాష్‌ చేయడం ఇద్దరికీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అంతేకాదు పొట్టి ఫార్మాట్‌ చరిత్రలో మూడు కంటే ఎక్కువ సిరీస్‌లలో ప్రత్యర్థిని వైట్‌వాష్‌ చేసిన జట్టుగా టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది.

Shilpa

Shilpa

Next Story