India vs New Zealand: రాంచీ రెండో టీ20లో భారత్‌ ఘనవిజయం

*కివీస్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు *3 టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న రోహిత్‌ సేన

Shilpa
Published on: 20 Nov 2021 6:33 AM IST
India Won the Match Against New Zealand with 7 Wickets in Second T20
X

రాంచీ రెండో టీ20లో భారత్‌ ఘనవిజయం(ఫైల్ ఫోటో) 

India vs New Zealand: రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ 20లో భారత్‌ ఘన విజయం సాధించింది. కివీస్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 3 టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది రోహిత్‌ సేన. ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్ భారత్‌ వసమైంది. టాస్‌ గెలిచి రోహిత్‌ సేన బౌలింగ్ తీసుకోగా న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

ఇక కివీస్‌ నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా సాధించింది. మూడు వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో 155 పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 65 పరుగులు, రోహిత్ శర్మ 55 పరుగులతో రాణించారు.

వెంకటేశ్‌ అయ్యర్ 12, రిషభ్‌ పంత్‌ 12 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక.. చివరి టీ20 మ్యాచ్‌ నవంబర్‌ 21న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరగనుంది.

Shilpa

Shilpa

Next Story