India vs New Zealand: మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌

*న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం *మూడు టీ20 సిరీస్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత్

Shilpa
Published on: 22 Nov 2021 7:09 AM IST
India Won the Match Against New Zealand in Third T20 Match
X

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం(ఫైల్ ఫోటో)

India vs New Zealand: మూడు టీ-20 సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కోలకతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాడ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. ఆ తర్వాత భారత్ నిర్ధేశించిన 185 పరుగుల లక్ష్య చేధనలో కీవిస్ కుప్పకూలింది. 17.2 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం 111 పరిగులు చేసి ఆలౌట్ అయ్యింది.

మ్యాచ్ ఆరంభంలోనే న్యూజిలాండ్ తడబడింది. బౌలర్ అక్సర్ పటేల్ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌కు షాకిచ్చాడు. 21 పరుగుల వద్ద ఓపెనర్ డరిల్ మిచెల్ ఐదు పరుగులు చేసి అక్సర్ పటేల్ బౌలింగులో హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మార్క్ చాప్‌మన్ డకౌట్ అయ్యాడు. 10.3 ఓవర్ల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. మార్టిన్ గుప్టిల్ 36 బంతుల్లో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. 4.4 ఓవర్ల వద్ద న్యూజిలాండ్ 30 పరుగులు చేసి మూడో వికెట్ కోల్పోయింది.

అక్సర్ పటేల్ వేసిన నాలుగు బంతులను ఎదుర్కొని గ్లెన్ ఫిలిప్స్ ఒక పరుగు కూడా చేయకుండా ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి మార్టిన్ గుప్టిల్ ఔటయ్యాడు. దీంతో మూడు టీ-20ల సిరీస్ ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

Shilpa

Shilpa

Next Story